అడివి శేష్ ఓ స్పై గా కనిపించనున్న గూఢచారి చిత్ర ట్రైలర్‌ను హీరో నాని శుక్రవారం విడుదల చేశారు. చిత్ర బృందంతో కలసి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నాని వారితో సరదాగా గడిపారు. ప్రధాన పాత్రలన్నింటిని చూపిస్తూ సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతంగా పెంచింది. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు లవ్ ట్రాక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.