సుప్రియ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ రామకృష్ణకు సహకరించిన అతడి స్నేహితుడు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ భార్యను హత్యచేసి వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తమ కుమార్తెను హతమార్చిన రామకృష్ణను ఉరి తీయాలని సుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నమ్మించి ప్రాణం తీసిన రామకృష్ణకు కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.