సాక్షి, చేవెళ్ల: సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడవద్దంటూ తల్లి మందలించినందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన టి.శివశంకర్, పుష్పలత దంపతుల కూతురు సుప్రియ (18) మొయినాబాద్ మండలంలోని గ్లోబల్ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. ఇటీవల సుప్రియ ఎక్కువగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి పుష్ప లత బుధవారం ఉదయం కూతురును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సుప్రి య.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కూతురు బెడ్‌రూమ్‌లో నుంచి ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చి లోపలికివెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించింది. తల్లి కేకలు వేయడంతో పక్కనున్నవారు వచ్చి చూడగా అప్పటికే సుప్రియ మృతిచెందింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (సూరీడుపై హత్యాయత్నం)
Comments
Please login to add a commentAdd a comment