టాలీవుడ్ జేమ్స్‌ బాండ్‌ : గూఢచారి | Adivi Sesh Goodachari Movie Trailer | Sakshi

Jul 4 2018 3:40 PM | Updated on Jul 5 2018 12:40 PM

Adivi Sesh Goodachari Movie Trailer - Sakshi

క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్‌ తరహా సినిమాతో

క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్‌ తరహా సినిమాతో రెడీ అవుతున్నాడు శేష్‌. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఆ అంచనాలను  మరింత పెంచేస్తూ ఇంట్రస్టింగ్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

స్టైలిష్‌ గా ఉన్న శేష్‌ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్‌ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత  నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్‌) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆగస్ట్‌ 3న రిలీజ్‌  కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement