నో షేవ్ నవంబర్ | No Shave November | Sakshi
Sakshi News home page

నో షేవ్ నవంబర్

Published Sat, Nov 29 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

నో షేవ్ నవంబర్

నో షేవ్ నవంబర్

ప్రొస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు కళాకారులంతా ఒక్కటయ్యారు. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ప్రారంభమైన ‘నో షేవ్ నవంబర్’ ఫొటో ఎగ్జిబిషన్‌ను వేదికగా చేసుకున్నారు. 35 ఏళ్లు దాటిన మగవాళ్లలో వచ్చే ఈ క్యాన్సర్‌ని ఆదిలోనే గుర్తిస్తే అంతమొందించొచ్చనే జాగృతిని కల్పించే విధంగా 54 రకాల ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో హీరోయిన్లు సంజన, సదా, అక్ష, సుప్రియా ‘నో షేవ్ నవంబర్’ పేరుతో ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్రపంచమంతా ఈ నెలలో మగవాళ్లు గడ్డాలు, మీసాలు గీసుకోరు. ఎందుకని వారినడిగితే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి వివరిస్తారు. ఇలా ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో జాగృతిని కల్పించే ప్రయత్నం జరుగుతోంద’ని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ కాలీ సుధీర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement