Muse Art Gallery
-
ఆర్ట్ ఈజ్ లైఫ్..
నందు మనవడిని పొదివి పట్టుకుని పేవ్‌మెంట్‌పై ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న అమ్మమ్మ ఆలింగనంలో ఆర్తి ఉంది. తుది శ్వాస వరకూ మనవడి భవిష్యత్తుకు ఆసరాగా నిలవాలన్న ఆదుర్దా ఉంది. వీటిని యథాతథంగా ప్రతిఫలింపజేసిన వర్ణ చిత్రం ఆహూతుల్ని ఆకట్టుకుంది. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం ప్రారంభమైన ఆర్ట్‌లైఫ్ ఎట్ 55 ప్రదర్శన ఇలాంటి అర్థవంతమైన చిత్రాలకు వేదికైంది. గోమాతతో ముచ్చట్లాడుతున్న బాలుడి వదనంలో సంతోషాన్ని, ఆర్ఫన్ హోమ్‌లోని చిన్నారి దీనమైన చూపుల్ని ఒడిసిపట్టుకున్న చిత్రకారిణి ఎన్ఆర్ఐ రాధా వల్లూరి అచ్చమైన భారతీయతను ప్రతిబింబించే చిత్రాలను గీసి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. చిత్ర ప్రదర్శనను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభించారు. సినీ హీరో నందు, హీరోయిన్లు విమలారామన్, నిఖితా నారాయణన్, పేజ్‌త్రీ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సినీనటి సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూష సపోర్ట్‌కు నిర్వాహకులు ఆర్థిక సహాయం అందించారు. -
నో షేవ్ నవంబర్
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు కళాకారులంతా ఒక్కటయ్యారు. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ప్రారంభమైన ‘నో షేవ్ నవంబర్’ ఫొటో ఎగ్జిబిషన్‌ను వేదికగా చేసుకున్నారు. 35 ఏళ్లు దాటిన మగవాళ్లలో వచ్చే ఈ క్యాన్సర్‌ని ఆదిలోనే గుర్తిస్తే అంతమొందించొచ్చనే జాగృతిని కల్పించే విధంగా 54 రకాల ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో హీరోయిన్లు సంజన, సదా, అక్ష, సుప్రియా ‘నో షేవ్ నవంబర్’ పేరుతో ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్రపంచమంతా ఈ నెలలో మగవాళ్లు గడ్డాలు, మీసాలు గీసుకోరు. ఎందుకని వారినడిగితే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి వివరిస్తారు. ఇలా ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో జాగృతిని కల్పించే ప్రయత్నం జరుగుతోంద’ని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ కాలీ సుధీర్ తెలిపారు. -
విజయం వెనుక
లక్ష్యం అందుకోవడం వెనుక ఉన్న శ్రవు పది వుందికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఒకరి విజయు క్షణాలు వురెందరినో కంకణబద్ధులను చేస్తుంది. అలాంటి ఫొటో ప్రదర్శనే చిక్కడపల్లి మారియట్ హోటల్లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం నిర్వహించారు. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎం. పూర్ణ, ఎస్.ఆనంద్ కుమార్ల శిక్షణ, ఎవరెస్ట్ యాత్రకు సంబంధించిన చిత్రాలను ‘ఓపీ ఎవరెస్ట్’ పేరుతో ప్రదర్శనలో ఉంచారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న దృశ్యం నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి భారత జాతీయు పతాకాన్ని రెపరెపలాడించడం వరకు ప్రతి ఘట్టాన్నీ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనకు ఐపీఎస్ ప్రవీణ్‌కువూర్, హీరో హర్షవర్ధన్ రాణే, నటి శ్రావ్యారెడ్డి తదితరులు హాజరయ్యారు. - కవాడిగూడ