![విజయం వెనుక](/styles/webp/s3/article_images/2017/09/2/71406486980_625x300.jpg.webp?itok=MMU7HZQq)
విజయం వెనుక
లక్ష్యం అందుకోవడం వెనుక ఉన్న శ్రవు పది వుందికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఒకరి విజయు క్షణాలు వురెందరినో కంకణబద్ధులను చేస్తుంది. అలాంటి ఫొటో ప్రదర్శనే చిక్కడపల్లి మారియట్ హోటల్‌లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం నిర్వహించారు. ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎం. పూర్ణ, ఎస్.ఆనంద్ కుమార్‌ల శిక్షణ, ఎవరెస్ట్ యాత్రకు సంబంధించిన చిత్రాలను ‘ఓపీ ఎవరెస్ట్’ పేరుతో ప్రదర్శనలో ఉంచారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న దృశ్యం నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి భారత జాతీయు పతాకాన్ని రెపరెపలాడించడం వరకు ప్రతి ఘట్టాన్నీ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనకు ఐపీఎస్ ప్రవీణ్‌కువూర్, హీరో హర్షవర్ధన్ రాణే, నటి శ్రావ్యారెడ్డి తదితరులు హాజరయ్యారు.
- కవాడిగూడ