20 రాష్ట్రాల్లో, 40 ఆదివాసి తెగలపై ఫొటోగ్రఫీ..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.
ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment