indigenous peoples
-
హార్ట్ ఆఫ్ ఆదివాసి..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు. -
గిరిజనుల ప్రాధాన్యతకి ఇదే నిదర్శనం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తూ.. నిత్యం ప్రకృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తూనే లక్షల మంది గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించాం. గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చి, కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశాం. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తూ.. నిత్యం ప్రకృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సౌకర్యాలు క… pic.twitter.com/GAp3Ria9J2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2023 -
ఈ ఇంటర్నెట్ మాకొద్దు బాబోయ్..!
జకార్తా: స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు. ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. -
International Jazz Day: జాజ్ జాజిమల్లి
జాజ్ జాజిమల్లికి కొత్త అందాన్ని తీసుకువస్తోంది ముంబైకి చెందిన ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. జాజ్ డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. ముంబైలోని ఆల్–ఉమెన్ జాజ్ టీమ్‌లో శ్వేతన్ కన్వర్, రాధిక మాయాదేవ్, రోషిణి నాయర్, వేదిక అగర్వాల్, దీక్ష, రియా సూద్ అనే డ్యాన్సర్లు ఉన్నారు. ‘స్టీరియోటైప్‌ను బ్రేక్ చేయడానికి జాజ్ టీమ్ ప్రారంభించాం’ అంటుంది ఫౌండర్ శ్వేతన్ కన్వర్.\ డెహ్రాడూన్‌కు చెందిన శ్వేతన్ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్ డ్యాన్స్ ఇప్పుడు తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఊహించలేదు. ‘జాజ్ డ్యాన్స్ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు’ అంటుంది శ్వేతన్. రాధిక మాయదేవ్ పదహారు సంవత్సరాల వయసు నుంచే జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డుచెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తరువాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు. కామర్స్ స్టూడెంట్ అయిన రోహిణి నాయర్ మొదట భరతనాట్యం చేసేది. ఆ తరువాత జాజ్ డ్యాన్స్‌లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది. ‘మా అమ్మాయి జాజ్ డ్యాన్సర్’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి. ‘ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడూ నిలవనీరులా ఉండకూడదు’ అంటున్న వేదిక అగర్వాల్ జాజ్‌కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్ డ్యాన్స్ అనగానే శాక్స్ఫోన్ శబ్దాలు, ఇంగ్లీష్ పాటల లిరిక్స్ వినిపిస్తాయి. ‘అలా మాత్రమే ఎందుకు!’ అంటూ ఈ టీమ్ జాజ్ డ్యాన్స్‌కు కొత్త లుక్ తీసుకువచ్చింది. ప్రసిద్ధ బాలివుడ్ పాటలతో జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభిచారు. ‘మొదట ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆనందిస్తారు. ఆ తరువాత ఆమోదిస్తారు’ అనే మాట ఈ టీమ్ విషయంలో నిజమైంది. ‘జాజ్ డ్యాన్స్‌లో బాలీవుడ్ పాటలు ఏమిటి!’ అని ఆశ్చర్య పోయినవారే వారి ప్రదర్శన చూసిన తరువాత ‘ఆహా! అద్భుతం’ అని మెచ్చుకున్నారు. ‘హిందీ సినిమా పాటలకే కాదు సౌత్ ఇండియన్ మ్యూజిక్కు కూడా జాజ్ డ్యాన్స్ జత చేయనున్నాం’ అంటుంది రోహిణి నాయర్. ‘మీరు చూస్తే లావుగా కనిపిస్తారు. ఇంత చక్కగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతున్నారు!’ అని చాలామంది రాధిక మాయదేవ్ను అడుగుతుంటారు. ఆమె ఆ సందేహానికి చెప్పే సమాధానం... ‘ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. రిథమ్ ఉంటుంది. ప్రతి బాడీకి డ్యాన్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకు అవసరమైనది సాధన మాత్రమే’ జాజ్ డ్యాన్స్‌లో కంటెంపరరీ, పుంక్, స్ట్రీట్ స్టైల్, లిరికల్ అండ్ కమర్శియల్...అంటూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటోంది ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. -
ఆదివాసీల హక్కులపై బీజేపీతో చర్చకు సిద్ధం
అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు. ‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది. -
త్రిపురలో 54 మందితో బీజేపీ జాబితా
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 54 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు కూడా ఉన్నారు. ఆమె ధన్పూర్ నుంచి, సీఎం మాణిక్ సాహా బోర్డోవాలి నుంచి బరిలో దిగుతున్నారు. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో సీట్ల సర్దుబాటు ఖరారైందని సాహా చెప్పారు. బీజేపీ 55 చోట్ల, ఐపీఎఫ్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. అసెంబ్లీలోని 60 సీట్లకు 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు విపక్ష సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. -
హృదయవిదారకం: తండ్రిని భుజాల మీద మోశాడు, కానీ..
శ్రవణ కుమారుడు.. రామాయణంలో ఉదాత్తమైన పాత్ర. అంధ తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ.. కంటికి రెప్పలా తన చివరిశ్వాసదాకా కాపాడుకున్న తనయుడు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం శ్రవణ కుమారుడిది. అలాంటి కొడుకులు ఈరోజుల్లో ఉంటారా? అంటే.. బ్రెజిల్లో ఓ యువకుడిని చూపిస్తున్నారు. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఆ కొడుకు పేరు తైవీ(24). భుజాన ఉంది అతని తండ్రి వాహూ. దట్టమైన అడవి.. ఆరు గంటల కాలినడకన గుట్టలు, వాగులు దాటి ప్రయాణించాడు. వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకుని.. తిరిగి మళ్లీ ఆరు గంటల ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాడు. వ్యాక్సినేషన్ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. అందుకే అలా. ‘ఈరోజుల్లో ఇలాంటి కొడుకు ఉంటాడా?’ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. డాక్టర్ ఎరిక్ జెన్నింగ్స్ సిమోయిస్ ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు. సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట తైవీ. వాస్తవానికి ఈ ఫొటో కొత్తది కాదు. కిందటి ఏడాదిలో తీసింది. పైగా ఈ కథ విషాదాంతం కూడా అయ్యింది. ఈ తండ్రీకొడుకులు జోయ్ గిరిజన తెగకు చెందినవాళ్లు. తైవీ, అతని తండ్రి మొదటి డోస్‌వ్యాక్సినేషన్ కోసం వెళ్తుండగా తీసిన ఫొటో. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వాహూ చనిపోయాడు. ఆయన మరణానికి కారణాలు తెలియవు. తైవీ ఆ కుటుంబానికి పెద్దగా మారాడు. ఈ మధ్యే మూడో వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు కూడా. బ్రెజిల్ పారా స్టేట్‌లో ఈ కమ్యూనిటీ పలు ప్రాంతాల్లో స్థిరపడింది. వాళ్లంతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుండగా.. కరోనా మాత్రం వెంటాడుతోంది. అందుకే వ్యాక్సిన్ కోసం ఇలా సాహసోపేతంగా ప్రయాణిస్తున్నారు. బ్రెజిల్ వ్యాప్తంగా 853 మంది గిరిజనులు చనిపోయారు. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు. విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప.. -
ఆదివాసుల దినోత్సవం: అడవితల్లి బిడ్డల అగచాట్లు
కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం... సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు నార్నర్(ఆసిఫాబాద్): ఆదివాసీ గిరిజనులు అనా దిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతకాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ వి వాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు ఆదివాసీ తెగలకు సంబంధింన 40 రకాల వాయిద్యాలు సేకరిం 2019 వర్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు. ఆదివాసీ వాయిద్యాలు : డోల్ (డోలు) : డోలు, డ ప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇత ర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒ క్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్, చెడ్యంగల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు. డప్ (డప్పు) : దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బ ట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు. పెప్రే(సన్నాయి) : పెప్రేలను ప్రధాన్, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్ వస్తుంది. కాలికోం(కొమ్ము) : పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్‌లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు. తుడుం : డోలు, డప్లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి వత్రమే దీనిని వాడతారు. కిక్రీ : ఇది తోటి, ప్రధాన్‌లలో ఉంటుంది. పెర్సాపెన్, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు. డోల్కి : ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు. ఆకట్టుకునే సంస్కృతి,సంప్రదాయాలు.. దండేపల్లి(మంర్యాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‌పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు. ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భమి, నీరు, అడవిలో దొరికే ఫలా లపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్త వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢవసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన)దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్, తదితర పూజలకు ఇప్పపరకనూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది. ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. మారని బతుకులు ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల 95వేల 794 మంది అదివాసీ గిరిజనులున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేసేందుకు 1975లో ప్రభుత్వం ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఏర్పాటైన ఐటీడీఏ నాలుగు దశాబ్దాలు దాటినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. నేటికి చాలా అదివాసీ గిరిజన ప్రాంతాలు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏటా జ్వరాలు, వ్యాధులతో వందల సంఖ్యలో మృత్యుఒడి చేరుతున్నారు. పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా.. జన్నారం(ఖానాపూర్): అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాĶæలు నేటికీ అద్దం పడుతున్నాయి. జన్నారం మండలంలోని లోతొర్రే, అలీనగర్, కొలాంగూడ, హాస్టల్ తండా, నర్సింగాపూర్, తదితర ఆదివాసీ గ్రావల్లో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. దండోరా సంబరాల్లో గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా సంప్రదాయం మారదు మేమంతా ఒకేతాటిపై ఉంటాం. మా తండ్రులు, తాతలు నేర్పిన సంప్రదాయాలు వర్చుకోం. సంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్లు మమ్మల్ని కాపాడుతారు. గూడెంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారు. – గంగరాం, లోతొర్రే గూడెం పటేల్ లక్ష్యం సాధించాలి... ఆదిలాబాద్‌రూరల్: నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతగానో శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించా. ఆదివాసీ తెగలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నా. క్రీడల్లో రాణించే వారికి సైతం ఆర్థికంగా చేయూత అందజేస్తున్నా. – డాక్టర్ సుమలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, ఆదిలాబాద్ దుకాణం నడుపుతూ చదివా ఆదిలాబాద్‌రరల్: వది బేల మండలంలోని దహేగాం. చదువుకునే రోజుల్లో సాంగిడిలో చిన్న కిరాణా షాపు నడిపించా. మా నాన్నకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. సర్పంచ్ చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో మాగ్రామానికి న్యూస్‌పేపర్ వచ్చేది కాదు. కిరాణా సామాను కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు పేపర్ చదివేవాడిని. 1985లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఎస్సైగా ఉద్యోగం సాధించాను. సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగా. – డీజీపీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మడావి బాపురావ్,డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఆదిలాబాద్‌రరల్: ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు అవకాశాలు లేవు. సౌకర్యాలు అంతంత వత్రమే. మా తల్లిదండ్రులు టీచర్లు కావడంతో ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల ను ప్రోత్సహించాలి. - కుడ్మేత మనోహర్, ఏజెన్సీ డీఎంహెచ్‌వో, ఉట్నూర్ పట్టుదలతో ఉద్యోగం సాధించా ఆదిలాబాద్‌రూరల్: నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే రోజుల్లో అంతగా పోటీ ఉండేది కాదు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. ఏకకాలంలో ఆర్టీసీలో, మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. అందులో మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నా. ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారు పేదవారికి సహాయం చేస్తే వారు కూడా ఉద్యోగం సాధించే ఆస్కారం ఉంటుంది. – సిడాం వామన్‌రావు, డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. బేల(ఆదిలాబాద్): మండలంలోని సోన్కాస్లో నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మేస్రం జనార్దన్, శాంతబాయి దంపతుల కుమారుడు మేస్రం నాగేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువు పూర్తి చేశాడు. 2013 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రం విభాగంలో చేరి 2018 జూన్‌లో పట్టా సాధించాడు. సోడియం ఫ్లోరైడ్ అనే టాక్సికేట్ను ఎలుకలకు ఇచ్చి ప్లురోసిస్ అనే వ్యాధిని గుర్తించాడు. వ్యాధిని నయం చేసేందుకు అల్లనేరేడు, జామ, ఉసిరి, అడవిబెండ వంటి ఫలాల నుంచి క్యూరే్సటిన్ అనే ఔషధాన్ని తయారు చేశాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఫర్ ఉమెన్స్, కోఠిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదర్శంగా నాగోరావు తాంసి: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మేస్రం నాగోరావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగం సాధించి ఆరేళ్లుగా విధులు నిర్వహిస్త తమ ప్రాంతంలోని గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిపాని గ్రామంలోని గిరిజన కుటుంబం చెందిన మేస్రం భంబాయి, దేవరావ్ల కుమారుడు మేస్రం నాగోరావు. మొదటి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐలో ఉద్యోగం సాధించి 2016లో విధులలో చేరాడు. -
ఆధునికత దిశగా వ్యవసాయం
సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు.