సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు.
ఆధునికత దిశగా వ్యవసాయం
Published Mon, Sep 29 2014 3:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement