హువా హిన్ (థాయ్‌లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. థాయ్‌లాండ్‌తో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో సానియా మీర్జా, అంకిత రైనా, ప్రేరణ బాంబ్రీ, ప్రార్థన తొంబారేలతో కూడిన భారత్ 0-3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 2-6, 5-7తో బున్యావి థామ్‌చైవాట్ చేతిలో... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6-7 (5/7), 3-6తో లుక్‌సికా కుమ్‌కుమ్ చేతిలో ఓడిపోయా రు. డబుల్స్‌లో ప్రేరణ-ప్రార్థన ద్వయం 7-6 (8/6), 2-6, 4-6తో కమోన్‌వన్ బుయామ్-పీంగ్తార్న్ జంట చేతిలో పరాజయం పాలైంది.
భారత్ పరాజయం
Published Thu, Feb 4 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement