Zee5 Launch Telugu Content Slate With 11 Originals Series: ప్రస్తుతం సినీ ప్రియులను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సూపర్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. మూవీ లవర్స్‌కు తగినట్లుగానే ఓటీటీలు విభిన్న కథాంశాలతో సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. ఇలాంటి ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునేవాటిలో ఒకటి జీ5. ప్రస్తుతం 12 భారతీయ భాషల్లో విభిన్నమైన కంటెంట్‌ను అందిస్తుంది జీ5. 2022 కోసం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ భాషల్లో అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది. ఈ సందర్భంగా 11 ఒరిజినల్స్‌తో కూడిన పవర్-ప్యాక్డ్ తెలుగు కంటెంట్‌ను జీ5 అందించనుంది.
హరీశ్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ 11 ఒరిజినల్స్ సిరీస్‌లను హైదరాబాద్‌లో జీ5 గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిలో రెక్కీ, మా నీళ్ల ట్యాంక్‌తో పాటు సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ జీ5లో రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ నటించిన ఏటీఎమ్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రివీల్ చేశారు. అలాగే రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ నటించిన అహా నా పెళ్లంట సినిమాలోని లిరికల్ వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు.
చదవండి: ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన Top 10 OTT ఒరిజినల్స్ ఇవే..
Comments
Please login to add a commentAdd a comment