జీ5 కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఫ్రెష్ కంటెంట్‌తో అదరగొడుతోంది. ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా మరో వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తోంది. 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇది జూన్ 17 నుంచి ప్రసారం కానుంది. 1990ల నాటి పీరియడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌లుగా రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు పోలూరు కృష్ణ గురువారం మాట్లాడుతూ.. 'తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఈ సిరీస్ వీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. కొత్తగా నియమితులైన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ "రెక్కీ"లో ఎక్సపెర్ట్ అయిన పరదేశిల మధ్య ఈ కథ నడుస్తుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు. ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి చేధించాడు అనేది కథ ప్రధానాంశం' అని చెప్పుకొచ్చాడు.
శ్రీరామ్, శివబాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేసినట్లు తెలుస్తోంది. సిరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామా తో వస్తున్న ఈ కథ వీక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి!
చదవండి: రామ్ చరణ్ అంటే క్రష్, అతడితో డేట్‌కి వెళ్తా: బాలీవుడ్ హీరోయిన్
ఆస్ట్రేలియా ఆఫర్, భారీ రెమ్యునరేషన్, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట
Comments
Please login to add a commentAdd a comment