
సమంత
నటిగా వెండితెరపై సమంత సూపర్ సక్సెస్. ఇదే మ్యాజిక్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారు. వెబ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి సమంత అడుగుపెట్టారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లో çసమంత నటించనున్నారు. ఫస్ట్ సీజన్ విజయవంతం కావడంతో రెండో సీజన్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లారు మేకర్స్. ‘‘డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా దూసుకెళ్తోంది.
ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండాలనుకుంటున్నాను. రాజ్ అండ్ డీకే రాసిన స్క్రిప్ట్ బాగుంది. డిజిటల్ మీడియంలోకి నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంత కన్నా బెటర్ పార్ట్‌నర్స్ ఎవరు ఉంటారు? సినిమాల్లో ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అన్నారు సమంత. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఫ్యామిలీమ్యాన్’ తొలిసీజన్‌తో నటి ప్రియమణి, హీరో సందీప్‌కిషన్ వెబ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment