నటి సమంత ఈ పేరే ఒక సంచలనం. తమిళంలో నటిగా కెరీర్‌ను ప్రారంభించినా, తెలుగులో ముందుగా స్టార్ అంతస్తును పొందిన నటి ఈమె. తెలుగులో ఏమాయ చేశావే చిత్రంతో అక్కడి ప్రేక్షకుల మనసులను దోచేసిన సమంత ఆ తరువాత స్టార్ హీరోలతో వరుసగా నటించి కథానాయకి లిస్టులో చేరిపోయారు. ఆ తరువాతనే తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సరనస నటించే అవకాశాలు వరించాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్యతో మనస్పర్థలు రావడం, విడిపోవడం, ఆ వెంటనే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడం వంటి సంఘటనలు సమంతను ఒకసారిగా కృంగదీశాయనే చెప్పాలి. అయితే ఈమె మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సమస్యల కారణంగా సినిమాలకు కాస్త దూరం అయిన మాట వాస్తవమే అయినా, అభిమానులకు మా త్రం దూరం కాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి గ్లామ రస్, వర్కౌట్ ఫొటోలతోనో, ఏదో టీట్‌లతోనో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నారు. ఇకపోతే ఖుషీ చిత్రం తరువాత సమంత ఇప్పటివరకూ మరో చిత్రంలో నటించలేదు. ఇటీవల సొంత నిర్మాణం చేపట్టి కథానాయకిగా నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత దాని ఊసే లేదు. ఇకపోతే తమిళంలో మరోసారి విజయ్‌తో జత కట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అదీ ప్రచారానికే పరిమితం అయ్యింది.
అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. కాగా తాజాగా సమంత మరోసారి హిందీ, తెలుగు, తమిళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తూపొందనున్న వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రముఖ నటీనటులందరూ వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే సమంత ఇంతకు ముందే ఫ్యామిలిమెన్–2, సిట్టాడల్, హని పన్ని వెబ్ సిరీస్‌లో నటించి పాపులర్ అయ్యారు.
తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. రాజ్, డీకేల ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్‌కు రక్తపీజ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది ఆగస్టు నెలలో ప్రారంభం కా నున్నట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్ కోసం నటీనటులతో రిహార్సల్ చేయిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చాలా గ్యాప్ తరువాత నటి సమంత కెమెరా ముందుకు వెళ్లనున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment