చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తా: రాజశేఖర్ | Actor Rajasekhar Ready to share screen with Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తా: రాజశేఖర్

Published Mon, Aug 4 2014 5:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తా: రాజశేఖర్ - Sakshi

చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తా: రాజశేఖర్

మల్టీస్టారర్ సినిమాలో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారని డాక్టర్ రాజశేఖర్ ను అడిగితే ఆయన ఎవరూ ఊహించని సమాధానమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనుందని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు. ఇంతకీ ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు ఆయన శ్రీమతి జీవిత. ఓ టీవీ కార్యక్రమంలో రాజశేఖర్ కు జీవిత ఈ ప్రశ్న సంధించారు. అయితే ఏమాత్రం తడుముకోకుండా రాజశేఖర్ చిరంజీవి పేరు చెప్పడం విశేషం. చిరంజీవికి దీటుగా ఉండే పాత్ర అయితే విలన్ గా చేయడానికి కూడా సిద్దమని ప్రకటించారు రాజశేఖర్.

మీతో నటించిన హీరోయిన్లలో నేను కాకుండా ఎవరంటే ఇష్టమని రాజశేఖర్ ను జీవిత మరో ప్రశ్న అడిగారు. దీనికి కొంటెగా జవాబిచ్చారు. ప్రతి హీరోయిన్ నచ్చుతుంది, బయటకు చెప్పగలుగుతామా అంటూ గడుసుగా సమాధానమిచ్చారు. అయితే నయనతార అంటే తనకిష్టమని రాజశేఖర్ చెప్పారు. ఇదే సమయంలో నయనతార మాజీ ప్రేమికుడు ప్రభుదేవా ఆయన పక్కనే ఉండడం విశేషం. జీవిత, రాజశేఖర్ తో పాటు ప్రభుదేవా కూడా ఈ షోలో పాల్గొన్నారు.

భార్యగా, దర్శకురాలిగా జీవితకు వంద మార్కులు వేస్తానని మరో ప్రశ్నకు రాజశేఖర్ జవాబిచ్చారు. రాజశేఖర్ కు ముందుగా తానే ప్రపోజ్ చేశానని జీవిత చెప్పగా, ప్రపోజ్ చేసేలా చేశానంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. జీవిత, రాజశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక జీవిత, రాజశేఖర్ దంపతులపై గతంలో చిరంజీవి అభిమానులు దాడి సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement