Chiranjeevi And Salman Khan Dance For Godfather Movie - Sakshi
Sakshi News home page

సల్మాన్‌తో మెగాస్టార్‌ స్టెప్పులు.. కనువిందు ఖాయం

Published Sat, Jul 30 2022 9:13 AM | Last Updated on Sat, Jul 30 2022 11:00 AM

Chiranjeevi And Salman Khan Dance For Godfather Movie - Sakshi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌  కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుంది? ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. చిరంజీవి కూడా ఈ మాటే అంటున్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌  రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’లో సల్మాన్‌ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, సల్మాన్‌  కాంబినేషన్‌ లో ఈ చిత్రం కోసం ఓ పాట చిత్రీకరిస్తున్నారు.

(చదవండి:  కేరాఫ్‌ లండన్‌ అంటున్న టాలీవుడ్‌ స్టార్స్‌)

‘‘భాయ్‌ (సల్మాన్‌)తో కలిసి కాలు కదుపుతున్నాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఐ ఫీస్ట్‌ ఖాయం’’ అని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌  సంగీత దర్శకుడు. నయనతార కీలక పాత్ర చేస్తుండగా, దర్శకుడు పూరి జగన్నాధ్‌ అతిథి పాత్ర చేస్తున్నారు.  మలయాళంలో విజయవంతమైన లూసీఫర్‌కి తెలుగు రీమేక్‌ ఇది. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement