GodFather: Salman Khan Fans Burst Firecrackers In Theatre, Video Viral - Sakshi
Sakshi News home page

థియేటర్‌లో టపాసులు కాల్చిన అభిమానులు, ప్రేక్షకులు పరుగో పరుగు

Published Sat, Oct 8 2022 8:36 PM | Last Updated on Mon, Oct 10 2022 4:50 PM

Godfather: Salman Khan Fans Burst Firecrackers In Theatre, Video Viral - Sakshi

చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం గాడ్‌ ఫాదర్‌. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. రామ్‌చరణ్‌, ఆర్‌బీ చౌదరి నిర్మించారు. మలయాళ హిట్‌ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా స్క్రీనింగ్‌లో సల్లూభాయ్‌ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్‌లో 'తార్‌మార్‌..' పాట ప్లే అవుతున్న సమయంలో కొందరు అభిమానులు టపాసులు కాల్చారు.

దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్‌ రా మావా అంటూ కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సల్మాన్‌ నటించిన అంతిమ్‌ మూవీ రిలీజైనప్పుడు కూడా అభిమానులు ఇలానే చేశారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్‌.. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కానీ గాడ్‌ఫాదర్‌ సినిమా విషయంలో మాత్రం హీరో మాటను సైతం లెక్క చేయకుండా మరోసారి థియేటర్‌లో టపాసులు కాల్చారు.

చదవండి: గుణశేఖర్‌ కూతురి నిశ్చితార్థం
నటిని షోరూమ్‌లో బంధించిన సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement