Godfather
-
గాడ్ ఫాదర్ సీక్వెల్ ఉండబోతుందా..?
-
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. -
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?
ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్‌డమ్‌కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్‌ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు. (చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి) ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్‌తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్‌లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్‌లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. -
కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి..
బిగ్‌బాస్ బ్యూటీ దివి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 4లో హౌజ్‌లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో అందరిని ఆకట్టుకుంది. ఉన్నది కొద్ది రోజులైన హౌజ్‌లో తనదైన మార్క్ వేసుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక దివి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. హీరోయిన్గా ప్రస్తుతం ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ 4 సీజన్ ఫినాలేకు అతిథిగా వచ్చిన చిరు.. దివికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? చెప్పినట్టుగానే దివికి గాడ్‌ఫాదర్‌లో ఓ కీ రోల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు చిరు. ఇందులో దివి రేణుకగా నటించి మెప్పించింది. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో దివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్న ఎదురైంది. మోడల్‌గా ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టిన మీరు ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యారని, ఈ ప్రయాణంలో ఎప్పుడైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై దివి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే అలాంటి సమస్యలు నాదాకా రాలేదనుకుంటా. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఇద్దరు(ఒక అమ్మాయి-అబ్బాయి) ఒకరినొకరు ఇష్టపడి కమిట్ అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి. -
‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్‌ఫాదర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్‌ఫాదర్ చూసి రజనీకాంత్ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్ మూమెంట్ అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఈ మేరకు మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ‘సూపర్ స్టార్ ‘గాడ్‌ఫాదర్’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్) సార్, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Superstar watched #Godfather 😇 Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version. Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe — Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022 -
ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం
ఒక సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలి? ఏ సినిమాను ఎక్కడ హైప్ చేయాలి? అనే విషయాలు దర్శకనిర్మాతలకు తెలియదా? మేం ఏం చేయాలో కూడా మీరే( మీడియా) నిర్ణయిస్తే ఎలా? అని మీడియాపై మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. గాడ్‌ఫాదర్ భారీ విజయం సాధించడంతో శనివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘గాడ్‌ఫాదర్’ని ఒరిజినల్ లూసిఫర్ కంటే బెటర్‌గా చేశాం. మా టీమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఆ సమయంలో మీడియాలో వచ్చే కొన్ని వార్తలు మాకు చిరాకు కలిగించాయి. సినిమాను సరిగా ప్రమోట్ చేయడం లేదని, హైప్ లేదని వార్తలు రాశారు. మేం ఏం చేయాలో కూడా మీరే నిర్ణయిస్తే ఎలా? అని చిరంజీవి ప్రశ్నించారు. (చదవండి: అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం) ‘గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ నేను స్పీచ్ ఇచ్చాను. ఒకవేళ నేను మాట్లాడకపోతే మీడియా మరోలా వార్తలు రాసి కంపు చేసేదనే భయంతో ఆ రోజు స్పీచ్ ఇచ్చాను. కానీ అదే మీడియా.. ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాత గాడ్‌ఫాదర్ గురించి అత్యద్భుతంగా రాసి మమల్ని ఎంకరేజ్ చేసింది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసిన మీడియాకు కృతజ్ఞతలు’అని చిరంజీవి అన్నారు. -
అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం
దసరా సందర్భంగా హైదరాబాద్‌లక్ష హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ వేడుకలో చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో గరికపాటి మాట్లాడుతుంటే.. అక్కడ జనాలు పట్టించుకోకుండా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూశారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి.. చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి స్టేజ్ మీదకు రాకుంటే..తాను వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను బాధించాయి. నాగబాబుతో సహా మెగా అభిమానులంతా గరికపాటిపై దండెత్తారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. చివరకు చిరంజీవికి గరికపాటి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. (చదవండి: గాడ్‌ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్‌బస్టర్: చిరంజీవి) తాజాగా ప్రముఖ ఛాయగ్రాహకుడు ఛోటా కె. నాయుడు కూడా గరికపాటిపై ఫైర్ అయ్యాడు. శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు(గరికపాటి). ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా చిరంజీవి ఇంటికి ఆహ్వానించారు. అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాం’ అని అన్నారు. ఛోటా కె. నాయుడు అలా మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి చేతులెత్తి నమస్కారం పెట్టారు. -
'గాడ్‌ఫాదర్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
థియేటర్లో టపాసులు కాల్చిన ఫ్యాన్స్, వీడియో వైరల్
చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రామ్‌చరణ్, ఆర్బీ చౌదరి నిర్మించారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా స్క్రీనింగ్‌లో సల్లూభాయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్లో 'తార్‌మార్..' పాట ప్లే అవుతున్న సమయంలో కొందరు అభిమానులు టపాసులు కాల్చారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ రా మావా అంటూ కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సల్మాన్ నటించిన అంతిమ్ మూవీ రిలీజైనప్పుడు కూడా అభిమానులు ఇలానే చేశారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్.. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కానీ గాడ్‌ఫాదర్ సినిమా విషయంలో మాత్రం హీరో మాటను సైతం లెక్క చేయకుండా మరోసారి థియేటర్లో టపాసులు కాల్చారు. Imagine what happen when tiger 3 release 🔥💥💥 Mass hysteria #SalmanKhan𓃵 #GodFather #Chiranjeevi pic.twitter.com/ZYJBcMFmyE — Abhishek❤️✨ (@salman_ka_abhi) October 8, 2022 చదవండి: గుణశేఖర్ కూతురి నిశ్చితార్థం నటిని షోరూమ్‌లో బంధించిన సిబ్బంది -
Godfather: చిరు మెచ్చాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు
మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీనంబర్ 150, ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. కొంత బ్రేక్ తర్వాత చిరు మరో రీమేక్‌తో తిరిగొచ్చాడు. ‘గాడ్ ఫాదర్’గా మారి దసరాకి థియేటర్స్‌కు పూనకాలు తీసుకొచ్చాడు. ఖైదీ నంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇచ్చింది మొదలు.. చిరు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పటి మెగాస్టార్ వేరు. ఇప్పుడు మన చూస్తున్న మెగాస్టార్ వేరు. అందుకే సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య విడుదలైంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చింది. ‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయలు నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ గాడ్ ఫాదర్‌కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. 2019 మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేకే ఈ గాడ్ ఫాదర్. లూసిఫర్ కథనం, పాత్రలపై మెగాస్టార్ మనసు పారేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా లూసిఫర్ స్టోరీ బాగా నచ్చింది. తన తండ్రి స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో నటిస్తే చూడాలనుకున్నాడు. అలా లూసిఫర్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయినా ఈ మూవీని చిరు ఎందుకు రీమేక్ చేస్తున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ రీజన్స్ మెగాస్టార్‌కు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్‌లో తాను నటిస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారో, ఆయనకు తెల్సినంతగా మరెవరికి తెలియదు. ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది. సైరాతో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఆడియెన్స్‌కు హాయ్ చెప్పారు చిరు. ఇప్పుడు గాడ్‌ఫాదర్‌తో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను పలకరించాడు. అందుకు మెయిన్ రీజన్ సల్మాన్ ఖాన్, గా డ్ ఫాదర్ లో కీలకమైన పాత్రలో నటిం చడమే. గాడ్ ఫాదర్ మూవీతో తొలిసారి సల్మా న్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. పైగా చిరు చేసిన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి, ఈరోల్ చేశాడు. అందుకే అతనికి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడట చిరు. కాని సల్మాన్ ఖాన్ సింపుల్‌గా 20 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసాడట. పైగా తన చిత్రంలో చిరు నటించాల్సి వస్తే, మీరు కూడా నన్ను రెమ్యునరేషన్ అడుగుతారా అంటు ఎదురు ప్రశ్నించాడట. సల్మాన్ తనపై చూపించిన ప్రేమను చూసి మెగాస్టార్ చలించిపోయారట. గాడ్ ఫాదర్‌కు ముందు ఈ మూవీకి బైరెడ్డి, రారాజు అనే టైటిల్స్ వినిపించాయి. అలాగే నయనతార పాత్రకు ఎంపిక చేసే ముందు సుహాసిని, విద్యాబాలన్ పేర్లు వినిపించాయి. గాడ్ ఫాదర్లో నయన్ సత్య ప్రియ పాత్రలో కనిపించింది. కేవలం 10 సినిమాల అనుభవం ఉన్న సత్యదేవ్ కు చిరు స్వయంగా ఫోన్ చేసి స్టోరీ అంతా చెప్పి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాల్సిందిగా కోరారట. గాడ్ ఫాదర్‌కు సంబధించి మరో విశేషం ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైమ్ చిరు ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. -
బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీలో గాడ్ ఫాదర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో అక్కడ మరో 600 స్క్రీన్స్‌ని పెంచినట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (చదవండి: వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు.. సమంత పోస్ట్ వైరల్) ‘గాడ్ ఫాదర్’పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల వసూళ్లను రాబట్టినందుకు ఆనందిస్తున్నా. ఈ రోజు(అక్టోబర్ 8) నుంచి హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ని పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చేసిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ధన్యవాదాలు .జై హింద్’అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. Another 600 screens added for #GodFather in Hindi 💥💥 Megastar @KChiruTweets thanks the audience for giving the HUMONGOUS BLOCKBUSTER 💥 -https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev pic.twitter.com/R04HA1nm2c — Konidela Pro Company (@KonidelaPro) October 8, 2022 -
మెగా హిట్ ‘గాడ్ ఫాదర్’.. ఓటీటీ స్ట్రీమింగ్ అందులోనేనా?
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గాడ్ ఫాదర్’ గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు తెలుగు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరిచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు మోహన్ రాజా. (చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్) దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ వారాంతంలో ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకుందట. రూ. 57 కోట్లకు తెలుగు, హిందీ భాషల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ చిత్రం రానుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే. -
కోహినూర్ మెరుపు తగ్గొచ్చు కానీ వ్యాల్యూ తగ్గదు.. నాగబాబు ట్వీట్ వైరల్
ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి హిట్ కొట్టాడు. తమ అభిమాన హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాలని చాలా కాలంగా మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. చిరు టైటిల్ పాత్రలో నటించిన సైరా, ఆచార్య చిత్రాలు ఆశించిన స్థాయిల్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. ముఖ్యంగా ఆచార్య ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో ‘గాడ్ ఫాదర్’తో భారీ హిట్ ఇచ్చాడు ‘అన్నయ్య’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే రూ. 38 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవి భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా ‘గాడ్ ఫాదర్’ విజయంపై స్పందిస్తూ చింజీవిని కొహినూర్ డైమాండ్‌తో పోల్చాడు. (చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర..రెండో రోజూ భారీ కలెక్షన్స్) ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలీష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన పాలీష్ (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం’అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేకే ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
అమెరికాలో " గాడ్ ఫాదర్ " సక్సెస్ సెలబ్రేషన్స్
-
బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘గాడ్ ఫాదర్’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ‘గాడ్ ఫాదర్’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజమే. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్‌లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. దసరా సందర్భంగా బుధవారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ భారీగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గాడ్ ఫాదర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.. నైజాం: రూ. 3.25 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు సీడెడ్: రూ.3.05 కోట్లు నెల్లూరు: రూ.57 లక్షలు గుంటూరు: రూ.1.75 కోట్లు కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు తూర్పు గోదావరి: రూ.1.60 కోట్లు పశ్చిమ గోదావరి: రూ.80 లక్షలు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. -
Godfather Review: గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ
టైటిల్: గాడ్ ఫాదర్ నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్,నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్,తదితరులు నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్.బీ చౌదరి దర్శకత్వం: మోహన్‌రాజా సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ : నీరవ్ షా ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్ విడుదల తేది: అక్టోబర్ 5, 2022 కథేంటంటే ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్ అకాల మరణంతో జన జాగృతి పార్టీ(జేజేపీ) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు జైదేవ్(సత్యదేవ్) భావిస్తాడు. సీఎం సీటు కోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, జేజేపీ పార్టీ కీలక నేత బ్రహ్మ తేజ(చిరంజీవి)మాత్రం జైదేవ్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో జైదేవ్ అతన్ని హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రలను బ్రహ్మ తేజ ఎలా తిప్పి కొట్టాడు. జైదేవ్ అసలు స్వరూపం భార్య సత్యప్రియ(నయనతార)కు ఎలా తెలిసింది? , అసలు బ్రహ్మ ఎవరు ? పీకేఆర్తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో వచ్చిన మసూన్ భాయ్(సల్మాన్ ఖాన్) ఎవరు? చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ హిట్ మూవీ లూసిఫర్‌కి రీమేక్. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. అంతేకాదు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అలాంటి సినిమాను ఎంచుకొని చిరంజీవి పెద్ద సాహసమే చేశాడు. కథపై నమ్మకంతో సినిమా చేశానని చెప్పాడు. చిరంజీవి నమ్మకం నిజమైంది. లూసిఫర్ చూసిన వాళ్లు కూడా గాడ్ ఫాదర్‌ని ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మాతృకలో కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. తనదైన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించాడు. పీకేఆర్ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రలను పరిచయం తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇద్దరు బలమైన,తెలివైన నాయకులు జైదేవ్(సత్యదేవ్), బ్రహ్మ(చిరంజీవి) ఆడే రాజకీయ చదరంగం అందరిని ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ముందు చిరు పలికే డైలాగ్స్ ఫాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సినిమా మరోస్థాయికి వెళ్తుంది. మసూద్ గ్యాంగ్ బ్రహ్మకు ఎందుకు సహాయం చేసింది?బ్రహ్మ నేపథ్యం ఏంటి.. చివరకు ఎవరిని సీఎం చేశారు?ఇలా సెకండాఫ్ సాగుతుంది. టిపికల్ నెరేషన్‌తో కొన్ని చోట్ల పొలిటికల్ డ్రామాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. హీరోయిజం ఎలివేషన్ మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. ప్రతి సీన్ చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోతాయి. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. బ్రహ్మతేజ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తన అభిమాన హీరోతో స్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో సత్యదేవ్ రెచ్చిపోయి నటించాడు. విలన్ జైదేవ్ పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి నయనతార కు చెప్పే సన్నివేశంలో సత్యదేవ్ నటన చాలా బాగుంటుంది. అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించి మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి పీకేఆర్ కూతురు, సత్యదేవ్ భార్య సత్యప్రియగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. సునీల్, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, షఫీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే.వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘గాడ్ ఫాదర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో డబ్ అయి, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాను మెగాస్టార్ మళ్లీ రీమేక్ చేయడంతో ‘గాడ్ ఫాదర్’పై అందరికి ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. దానికితోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలు మధ్య నేడు(ఆక్టోబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. ‘గాడ్ ఫాదర్’తో చిరంజీవి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడని నెటిజన్స్ అంటున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’అని ట్వీట్స్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెబుతున్నారు. మాతృకలో ఉన్న మెయిన్ పాయింట్‌ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలో భారీ మార్పులే చేశారని చెబుతున్నారు.ఇక మరికొంతమంది అయితే గాడ్ ఫాదర్ యావరేజ్ సినిమా అంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Better than Lucifer… Boss @KChiruTweets 👍🏻 & @ActorSatyaDev 👌🏻Thaman score good konni scenes ki… KCPD petti d’garu entra BGM laaga 😂 NajaBhaja Timber depot sequence 🔥 Just ahh makeup & hairstyle care tiskunte baundedi… #GodFather — 𝕽𝖆𝖛𝖎𝖎 (@Ravii2512) October 5, 2022 #Godfather A Good Political Action-Thriller that is a faithful remake which sticks true to the core but has changes that keep the proceedings engaging. Megastar and Thaman show all the way. Fine job of making changes without spoiling the core. Good One👍 Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) October 4, 2022 Sare inka fact to be agreed so mana boss @KChiruTweets kuda hit kottesadu malli #GodFather tho 🔥🔥🔥🔥 . Congrats to the entire team and especially for mega fans 🤟🤟 !! #GodFatherOnOct5th #GodFatherReview pic.twitter.com/7ErWNcmrHP — Akash Raju 🔥🔥 (@Raju_SSMB) October 5, 2022 Lucifer movie telugu lo release ayipoyi andharu chusaru and chala mandiki anthaga ekkaledu kuda… ilanti movie ni remake chesi…andhari uuhalani thaar maar chesi, mee range lo hit talk vastundi ante @KChiruTweets 🔥🙏🏽 Boss is always beyond fans expectations #GodFather — Anudeep (@AnudeepJSPK) October 5, 2022 First half Good and Second Half Average 👍👍 @MusicThaman anna gattiga duty chesadu 🔥 Production values 👌👌 SatyaDev performance 💥💥 Boss lo aa timing miss avuthundi and dlgs kuda yedho cheppali annattu cheppadu 👍 Finally Average film 🙂 2.5/5 👍#GodFatherReview https://t.co/21gK3i9D7x — Gopi Nath NBK (@Balayya_Garu) October 4, 2022 Hearing blockbuster response all over 💥🔥😎 #Godfather ఆయన స్థాయి వేరు... ఆయన స్థానం వేరు..🦁 అక్కడ ఉన్నది Boss ra Bacchas After a Gap BOSS IS BACK! 👑@KChiruTweets #BlockBusterGodFather pic.twitter.com/HzESnXuY5F — Muzakir Ali (@Muzakirali_07) October 5, 2022 ఒక ఇంద్ర,tagore, స్టాలిన్,ఎలానో #godfather కూడ ఆ లిస్ట్ లో చేరిపోయింది.hatters kooda అంటారు మూవీ చూసిన తర్వాత #Lucifer కంటే #godfather బాగుంది అని, elevation scence Ki @MusicThaman ichina bgm🔥🔥🔥,ippudu ravalamma tollywood #mohanalal fans, — yuga cherry (@yuga_cherry) October 5, 2022 #Godfather Review: 3.75/5 Perfect and Pure Mass & Family Entatainer Chiranjeevi Swag is Next Level Sallu Bhai did his Roll Perfectly 👍👍#GodFatherReview pic.twitter.com/mN5cV1BD6a — Rusthum (@JanasenaniPK) October 4, 2022 #Godfather first half works 👍 Decent execution. ✅ 1st half review:#Chiranjeevi’s swag and elevation 👍 Satya Dev is brilliant Lot of Goosebump moments for fans !! BGM is spot on 👍 Very Engaging and high on drama Waiting for 2nd half #Salman’s magic#GodfatherReview — Santosh R. Goteti (@GotetiSantosh) October 5, 2022 -
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్‌ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్‌ఫాదర్‌ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్‌బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి.. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్‌బాట్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు 20, టూటౌన్ పోలీసు స్టేషన్‌కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. -
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)