మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. ఇటీవల రిలీజైన గాడ్‌ఫాదర్ ట్రైలర్‌లో చిరంజీవి డైలాగ్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ఓ రేంజ్‌లో అభిమానులను ఊపేసింది. అయితే తాజాగా మెగాస్టార్ ఆ డైలాగ్‌పై స్పందించారు.
(చదవండి: ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్‌ఫాదర్: చిరంజీవి)
గాడ్ ఫాదర్ పొలిటికల్ డైలాగ్‌పై తాజాగా యాంకర్ శ్రీముఖితో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ స్పందించారు. మెగాస్టార్ మాట్లాడుతూ 'ఆ డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకోలేదు.. ఇది కూడా ఓ రకంగా మంచిదే.. అభిమానుల్లో అంత బలంగా ఈ డైలాగ్ దూసుకెళ్తుందని ఊహించలేదని' అని అన్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవితో ప్రత్యేక విమానంలో ఇంటర్వ్యూ జరిగింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment