రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమాకు చాలామంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందన్నారు. అప్పన్న, రామ్ నందన్ పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా చేశారని తనయుడిని కొనియాడారు. ఈ సందర్భంగా సక్సెస్ సాధించిన గేమ్ ఛేంజర్ చిత్రబృందానికి ఆయన అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను అందించిన దర్శకుడు శంకర్‌తో పాటు దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Delighted to see lots of appreciation for @AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue &
Ram Nandan, the determined IAS officer out to cleanse the system.
Hearty Congrats to @iam_SJSuryah @advani_kiara @yoursanjali ,
Producer #DilRaju @SVC_Official ,
above…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 10, 2025
నాలుగు పాటలకే రూ.75 కోట్లు..
ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. అందువల్లే ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా రిలీజ్‌కు ముందే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.
గేమ్ ఛేంజర్ కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.
ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment