GodFather: Anchor Sreemukhi Interview With MegaStar Chiranjeevi, Promo Released - Sakshi
Sakshi News home page

God Father Interview Promo: ఆకాశంలో గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌.. ఆసక్తి పెంచుతోన్న తాజా ప్రోమో

Published Sat, Sep 24 2022 3:19 PM | Last Updated on Sat, Sep 24 2022 4:32 PM

God Father Megastar Interview With Anchor Srimukhi Promo Released  - Sakshi

మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్‌లో భాగంగా గాడ్ ఫాదర్ మూవీ చిత్రబృందం సరికొత్తగా ప్లాన్ చేసింది. ఏకంగా ఆకాశంలో ఇంటర్వ్యూ నిర్వహించింది.

(చదవండి: God Father: గాడ్‌ఫాదర్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్)

ప్రత్యేక విమానంలో తిరుగుతూ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూకి సంబంధించి తాజాగా ప్రోమోలను రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన తార్‌ మార్‌ టక్కర్‌ మార్  సాంగ్ అభిమానులను ఓ రేంజ్‌లో ఊర్రూతలూగిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 5 రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ ఇచ్చింది. త్వరలోనే అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 


 

ఈ ప్రోమోలో 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత హైప్‌ క్రియేట్ చేసింది. ప్రోమోలో చిరంజీవి లుక్ అదిరిపోయిందంటూ శ్రీముఖి అనడంతో నవ్వుతూ సమాధానాలిచ్చాడు మెగాస్టార్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమతో చేశాడు. హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్ అంటూ చిరు ప్రశంసించారు. పూరీ జగన్నాథ్‌లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తరువాత మీరే ఆశ్చర్యపోతారు అన్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ ఆరో ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే గాడ్ ఫాదర్. నిశ్శబ్ద విస్పోటనం అంటూ  మెగాస్టార్ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమాలో చూస్తారని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని  కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement