
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ తరచూ ఏదోక అప్‌డేట్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్‌డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ పేరుతో తాజాగా ఈ సినిమాలో తొలి సాంగ్ ప్రోమోను వదిలింది చిత్ర బృందం.
చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!
పెప్పీ నెంబర్‌గా వస్తున్న ఈ పాటలో మెగాస్టార్ చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దుమ్ములేపాడు. వారిద్దరు చేసిన స్వాగ్ మూమెంట్స్ ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘తార్ మార్ టక్కర్ మార్’ అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో మెగా ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.