
విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్, చిరంజీవి, పూరి జగన్నాథ్, చార్మి
ముంబైలో ‘గాడ్ ఫాదర్’ని కలిశారు ‘లైగర్’. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరించారు.
కాగా ‘లైగర్’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ఈ సినిమా టీమ్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లింది. చిరంజీవి, సల్మాన్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేసింది. ఇక్కడున్న ఫొటో ఆ లొకేషన్‌కి సంబంధించినదే. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరులో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment