Godfather Movie Day 2 World Wide Box Office Collections Details - Sakshi
Sakshi News home page

Godfather Box Office Collection: బాక్సాఫీస్‌పై ‘గాడ్‌ ఫాదర్‌’ దండయాత్ర, రెండు రోజుల్లో ఎంతంటే..?

Oct 7 2022 12:58 PM | Updated on Oct 7 2022 1:48 PM

Godfather Movie Day 2 Box Office Collection Details - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్‌ షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకొని బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.  చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ‘గాడ్‌ ఫాదర్‌’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్‌ వసూళ్లను సాధించిన ‘గాడ్‌ ఫాదర్‌’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది.  రెండో రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.31 కోట్లు కలెక్ట్‌ చేసింది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాకు తొలి  రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం సహజమే. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఫస్ట్‌ డేతో పోలిస్తే సెకండ్‌ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి.

కానీ గాడ్‌ ఫాదర్‌ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్‌లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement