ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్‌కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్‌డమ్‌కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్‌ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు.
(చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి)
‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్‌తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్‌లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్‌లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను.
గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్‌ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment