టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గాడ్ ఫాదర్’ గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు తెలుగు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరిచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు మోహన్ రాజా.
(చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్)
దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ వారాంతంలో ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకుందట. రూ. 57 కోట్లకు తెలుగు, హిందీ భాషల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ చిత్రం రానుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment