మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీనంబర్ 150, ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. కొంత బ్రేక్ తర్వాత చిరు మరో రీమేక్‌తో తిరిగొచ్చాడు. ‘గాడ్ ఫాదర్’గా మారి దసరాకి థియేటర్స్‌కు పూనకాలు తీసుకొచ్చాడు.
ఖైదీ నంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇచ్చింది మొదలు.. చిరు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పటి మెగాస్టార్ వేరు. ఇప్పుడు మన చూస్తున్న మెగాస్టార్ వేరు. అందుకే సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య విడుదలైంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చింది.
‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయలు నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ గాడ్ ఫాదర్‌కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. 2019 మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేకే ఈ గాడ్ ఫాదర్. లూసిఫర్ కథనం, పాత్రలపై మెగాస్టార్ మనసు పారేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా లూసిఫర్ స్టోరీ బాగా నచ్చింది. తన తండ్రి స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో నటిస్తే చూడాలనుకున్నాడు. అలా లూసిఫర్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది.
మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయినా ఈ మూవీని చిరు ఎందుకు రీమేక్ చేస్తున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ రీజన్స్ మెగాస్టార్‌కు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్‌లో తాను నటిస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారో, ఆయనకు తెల్సినంతగా మరెవరికి తెలియదు. ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది.
సైరాతో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఆడియెన్స్‌కు హాయ్ చెప్పారు చిరు. ఇప్పుడు గాడ్‌ఫాదర్‌తో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను పలకరించాడు. అందుకు మెయిన్ రీజన్ సల్మాన్ ఖాన్, గా డ్ ఫాదర్ లో కీలకమైన పాత్రలో నటిం చడమే. గాడ్ ఫాదర్ మూవీతో తొలిసారి సల్మా న్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. పైగా చిరు చేసిన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి, ఈరోల్ చేశాడు. అందుకే అతనికి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడట చిరు. కాని సల్మాన్ ఖాన్ సింపుల్గా 20 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసాడట. పైగా తన చిత్రంలో చిరు నటించాల్సి వస్తే, మీరు కూడా నన్ను రెమ్యునరేషన్ అడుగుతారా అంటు ఎదురు ప్రశ్నించాడట. సల్మాన్ తనపై చూపించిన ప్రేమను చూసి మెగాస్టార్ చలించిపోయారట.
గాడ్ ఫాదర్‌కు ముందు ఈ మూవీకి బైరెడ్డి, రారాజు అనే టైటిల్స్ వినిపించాయి. అలాగే నయనతార పాత్రకు ఎంపిక చేసే ముందు సుహాసిని, విద్యాబాలన్ పేర్లు వినిపించాయి. గాడ్ ఫాదర్‌లో నయన్ సత్య ప్రియ పాత్రలో కనిపించింది. కేవలం 10 సినిమాల అనుభవం ఉన్న సత్యదేవ్ కు చిరు స్వయంగా ఫోన్ చేసి స్టోరీ అంతా చెప్పి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాల్సిందిగా కోరారట. గాడ్ ఫాదర్‌కు సంబధించి మరో విశేషం ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైమ్ చిరు ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment