
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో జోరు పెంచింది చిత్ర యూనిట్.
నేడు(స్టెప్టెంబర్ 28) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది. ఇప్పటికే అనంతపురంలో ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రీరిలీజ్ వేడుక కోసం అక్కడ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. డ్రోన్స్ ద్వారా చిరు, సల్మాన్ కటౌట్లపై పుష్పాల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, పాటలతో పాటు చిరు చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌తో గాడ్ ఫాదర్‌కు భారీ హైప్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment