cutouts
-
సెలబ్రేషన్స్ టైమ్
ప్రభాస్ జన్మదిన (అక్టోబర్ 23) వేడుకను హైదరాబాద్‌లోని కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఫ్యాన్స్ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ‘సలార్’ చిత్రం లుక్‌తో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ఫారిన్లో ఉన్నారని, వచ్చే నెల తన మరో చిత్రం ‘కల్కి 2898ఏడీ’ షూటింగ్లో ఆయన పాల్గొంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. -
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
చిరంజీవి, సల్మాన్‌లకు భారీ కటౌట్స్
-
GodFather Pre Release Event: చిరంజీవి, సల్మాన్‌లకు భారీ కటౌట్స్
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో జోరు పెంచింది చిత్ర యూనిట్. నేడు(స్టెప్టెంబర్ 28) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది. ఇప్పటికే అనంతపురంలో ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రీరిలీజ్ వేడుక కోసం అక్కడ చిరంజీవి, సల్మాన్ ఖాన్లకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. డ్రోన్స్ ద్వారా చిరు, సల్మాన్ కటౌట్లపై పుష్పాల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, పాటలతో పాటు చిరు చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌తో గాడ్ ఫాదర్‌కు భారీ హైప్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్.. ఎక్కడంటే ?
Vijay Devarakonda Massive Cutout At Sudarshan 35MM: హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదవుతున్నాయంటే థియేటర్ ముందు భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తారు. అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టడం సాధారణమే. ఇటివల కాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు సైతం హీరోల కటౌట్లు పెట్టి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుతున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాగే గీత గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది 'లైగర్'. ఈ మూవీకి టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయ్‌కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక 'లైగర్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్ వావ్ అనిపించేలా ఉంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం (జులై 21) ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. -
అభిమానుల నుంచి జక్కన్నకు ఆసక్తికర గిఫ్ట్.. దర్శక ధీరుడి భారీ కటౌట్
RRR Movie Director Rajamouli Massive Cutout In Hyderabad: సినిమా హీరోలను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఎవరిమీద చూపినంచా ప్రేమ ఒలకబోస్తారు. తమ ఫేవరెట్ హీరోలను 'అన్న' అని పిలుస్తూ ఇంట్లో మనిషిలా భావిస్తారు. అలాంటిది వారి అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఊగిపోతారు. అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. అయితే ఇప్పుడు ఒక డైరెక్టర్‌కు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. యావత్ భారతదేశం ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కించిన ఓటమెరుగని దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. అవును.. రాజమౌళిపై ప్రేమతో ఆయనకు భారీగా కటౌట్ కట్టారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ భారీ కటౌట్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. చదవండి: అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్' టికెట్లు.. ఎక్కడ ? ఎలా ఉన్నాయంటే ? స్టూడెంట్ నెం.1 నుంచి మొన్నటి బాహబలి 2 దాకా జక్కన్న చెక్కిన ప్రతీ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్. ఇప్పుడు మరికొన్ని గంటల్లో విడుదల కానున్న రౌద్రం.. రణం.. రుధిరం అన్నింటికి మించి విజయం దక్కించుకోనుందని రాజమౌళి విశ్వాసం వ్యక్తం చేశారు. బాహుబలితో భారతీయ సినీమా రేంజ్ ఏంటో చూపించిన జక్కన్నకు అనేకమంది అభిమానులు ఏర్పడ్డారు. ఈ అభిమానంతోనే హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం వద్ద జక్కన్న భారీ కటౌట్ పెట్టడం ఆసక్తిరేపుతోంది. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే.. -
ప్రమాదకరంగా కటౌట్లు..!
శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లోనూ.. బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్‌తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలగింపులో నిర్లక్ష్యం.. రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది.. బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. -
భర్త కటౌట్‌తో నటి సీమంతం
హీరో అర్జున్ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా కొద్ది నెలల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!) ఈసందర్భంగా ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మేఘన షేర్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్ చూస్తుంటే ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సర్జా కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయన నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు తనతోనే జీవితాంతం ఉంటాయని మేఘన పేర్కొన్నారు. -
వివాహం: కార్డ్ బోర్డు కట్ అవుట్లే అతిథులు
పెళ్లి కళ అంటారు కానీ, ఆ కళ వధూవరులకు వాళ్లకై వాళ్లకు వచ్చేది కాదు. వస్తూ వస్తూ.. పెళ్లికి వచ్చేవాళ్లు తెచ్చేది. కరోనా వల్ల ఇప్పుడు వాళ్లు రాక, రాలేక లోకానికే పెళ్లి కళ తప్పింది. అటిద్దరు, ఇటిద్దరు! చేసుకుని ఏం లాభం అని అమ్మాయి అబ్బాయి నిరుత్సాహంగానే పీటల పై కూర్చుంటున్నారు. ఏదో.. చేసుకుంటున్నామంతే అన్నట్లు నీరసంగా దండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడంటే సరే.. పదేళ్లకో, పాతికేళ్లకో పెళ్లి ఫోటోలు చూసుకోవాలనిపించదా.. అప్పుడూ నీరసమే కదా.. పెళ్లి వేడుకలో ఆకాశమంత పందిరి కనిపించి, ఆ పందిరి కింద పెళ్లికి రాని వారు కనిపించకపోతే! అందుకే ఇంగ్లండ్ లో ఓ పెళ్లిజంట 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి (రెండు వేల పౌండ్ లకు పైగా) 48 మంది గెస్టుల్ని పెళ్లికి ’తెప్పించుకుంది’. అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనల ప్రకారం పెళ్లిలో 30 మందికి మించి కనిపించడానికి లేదు. మరి వీళ్లు అంతమందిని ఎలా తెప్పించుకున్నారు? కార్డ్ బోర్డులతో వాళ్ల కట్ అవుట్ లు చేయించుకుని, పెళ్లికి ట్రాన్స్ పోర్ట్ చేయించుకున్నారు. వాటి పక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. పెళ్లికూతురి పేరు రోమీ. ఆమెదేనట ఈ ఐడియా. ’వావ్’ అంటూ ఆమెను ఆరాధనగా చూడ్డానికే సరిపోయిందట పెళ్లి కొడుకు స్మిత్ కి.. పెళ్లి రోజంతా. -
ఈ కటౌట్‌కు సాటి లేదు!
-
ఈ కటౌట్‌కు సాటి లేదు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రిరీలిజ్ వేడుకను ఈనెల 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ధియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్టిన మహేశ్‌బాబు 50 అడుగుల కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వెంకట పద్మావతి ధియేటర్ వద్ద పెట్టిన కటౌట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల పాటు ఒడిశాలోనూ ప్రచారం పర్వం ఊపందుకోవడం విశేషం. అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. -
టాక్‌ఆఫ్ ది టాలీవుడ్‌గా 81 అడుగుల కటౌట్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన టీజర్ తరువాత సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాజాగా విడుదలైన టీజర్ వ్యూస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద దర్శనమిస్తున్న మహేశ్ బాబు భారీ కటౌటే నిదర్శనం. హైదరాబాద్‌లోని మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు 81 అడుగుల కటౌట్‌ని థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కటౌట్ ప్రస్తుతం టాక్‌ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టడం జరుగుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే కటౌట్ పెట్టేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కటౌట్ పెట్టి అంచనాలు పెంచేశారు
‘‘ఓ బేబీ’ చిత్రం కోసం హైదరాబాద్‌లో నా కటౌట్ పెట్టడం సంతోషంగా ఉన్నా టెన్షన్‌గానూ ఉంది. నేను నటించిన ‘యు టర్న్’ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ, కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ముఖ్యం. ఇందాక ఇంటి నుంచి వస్తున్నప్పుడు చైతూతో (నాగచైతన్య) ఇలా చెప్పా.. ‘కటౌట్లు పెట్టి అంచనాలు పెంచేస్తున్నారు, ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే నేను పారిపోతా అని చెప్పాను (నవ్వుతూ)’’ అన్నారు సమంత. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత పంచుకున్న విశేషాలు. ► నా కెరీర్లో ‘ఓ బేబీ’కి చేసినంత ప్రమోషన్ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎక్కువ మంది చూడాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్ చేస్తున్నా. నా గత సినిమా ‘మజిలీ’ ప్రమోషన్ కూడా నా బాధ్యతగా అనిపించింది. పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి చేశా. ‘ఓ బేబీ’ పూర్తి బాధ్యత నాపై ఉండటం కొంచెం భయంగా ఉంది. అయితే సినిమాపై నమ్మకం ఉంది. ► సాధారణంగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రమే నేను తిరుమలకి వెళ్లేదాన్ని. కానీ, తొలిసారి నా సినిమా కోసం యూనిట్‌తో కలిసి తిరుమల వెళ్లొచ్చాను. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఎంతవరకూ ఉంటాయన్నది తెలియదు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలకైతే ప్రేక్షకులే థియేటర్‌కి వచ్చేస్తారు. కానీ, ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం చిన్న విషయం కాదు. థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ► ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామాలకు ఉన్న రిథమ్ నాకు బాగా తెలుసు. కానీ, కామెడీ రిథమ్ తెలియదు. కామెడీ చూడటం, నవ్వడం తేలికే. కానీ చేయడం చాలా కష్టం. ‘అఆ’ చిత్రంలో కొంచెం ట్రై చేశా. కానీ, ఈ సినిమాలో వినోదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్‌గారు నాకు చాలా బాగా నేర్పించారు. నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. ఈ సినిమాలో బామ్మగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలు ఎలా ఉంటారని పరిశీలించాను. ► నందినీరెడ్డి ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. సామర ్థ్యం ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. మేల్ డైరెక్టరా? ఫిమేల్ డైరెక్టరా? అన్నది ముఖ్యం కాదు. జండర్ తేడాలు భవిష్యత్తులోనైనా రావనే అనుకుంటున్నా. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదని, ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ► ‘ఓ బేబీ’ క్లైమాక్స్ సీన్‌ని చాలా కష్టపడి చేశా. ఎమోషనల్ సీన్స్ ఈజీగా చేసేదాన్ని. కానీ, రావు రమేశ్‌గారు నా కొడుకు పాత్ర చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదు. నా కెరీర్ మొత్తంలో ఒక ఏడుపు సీన్ కోసం రెండు గంటలు బ్రేక్ తీసుకుని, ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఇది. ► ప్రెగ్నెన్సీ విషయం గురించి అడగడంలో తప్పు లేదు? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల, నా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఈ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేది కాదేమో? ఇలాంటి ఎన్నో విషయాలను ఆలోచింపజేసే సినిమా ఇది. ► శేఖర్ కమ్ములగారు హీరోయిన్లను చూపించే తీరు బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. మణిరత్నం సార్ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. నాకు దర్శకత్వం ఆలోచనలు మాత్రం లేవుగానీ, మహిళాప్రాధాన్యం ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తా. ప్రస్తుతం ‘96’ సినిమా సెట్స్ మీద ఉంది. ‘మన్మథుడు 2’ లో చిన్న పాత్ర చేశాను. -
ప్రధాని వింత చర్య.. అంతా షాక్!
బ్యాంకాక్ : సైనిక చర్యతో అధికారాన్ని హస్తగతం చేసుకుని పరిపాలన సాగిస్తోన్న ఆర్మీ చీఫ్ జనరల్, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా చర్యలు ప్రజలతో పాటు మీడియా సంస్థలకూ చిర్రెత్తుకొస్తుంది. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ప్రయూత్ను కొందరు మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే వారి ప్రశ్నలకు బదులివ్వకుండానే దిమ్మతిరిగిపోయేలా ప్రవర్తించారు ప్రధాని. వేదిక మీద ఏర్పాటు చేసిన కటౌట్‌ను చూపిస్తూ ఆయనకు మీ ప్రశ్నలు సంధించాలంటూ జర్నలిస్టులకు సూచిస్తూ నవ్వుతూ వెళ్లిపోయారు ప్రయూత్. త్వరలో నిర్వహించనున్న బాలల దినోత్సవం ఏర్పాట్లపై ప్రధాని ప్రసంగించారు. అనంతరం మీడియా ప్రతినిధులు దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఏ విధంగా ఎదుర్కొంటారు. మీ పరిపాలనపై ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారని.. సమర్థవంతంగా పాలన సాగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారని ప్రధాని ప్రయూత్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఎంతో కూల్‌గా బదులిచ్చారు. తన కటౌట్‌ను చూపిస్తూ.. మీ ప్రశ్నలకు ఆయన కచ్చితంగా సరైన సమాధానం చెబుతారంటూ చిరునవ్వులు చిందించడంతో ప్రధానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చెప్పిన వెంటనే ఓ అధికారి మైక్ ముందుకు ప్రధాని కటౌట్‌ను తీసుకురావడం గమనార్హం. 2014లో అప్పటి ప్రధాని ఇంగ్లక్ షినవాత్రా ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు కుట్ర పన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయూత్ చాన్ ఓచా అధికారం హస్తగతం చేసుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిలటరీ బలాన్ని రోజురోజుకు పటిష్టం చేసుకుంటూ వస్తున్న ప్రయూత్ అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పరిపాలన కొనసాగించాలంటూ వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవడం లేదు. -
కేసీఆర్, హరీశ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
సిద్దిపేట: ‘‘దశాబ్ద కాలం క్రితం అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. పట్టాలు లేక ఇబ్బంది పడ్డాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి.. మా లాంటి పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు.. ఆయన చలవతో మేము సొంతింటి వాళ్లమయ్యాం.. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.. అని సిద్దిపేటకు చెందిన పలువురు పేర్కొన్నారు. పట్టణ శివారులోని 1,340 సర్వేనంబర్‌లో గల అసైన్డ్ భూముల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా కాలంగా నివాసం ఉన్నా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని భయాందోళన చెందారు. అయితే సీఎం కేసీఆర్ ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పలువురి పాలిట వరంగా మారింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాలు పంపిణీ చేశారు. దీంతో వారు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు శివారులోని చైతన్యపూరి తోపాటు పలు కాలనీల ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించడం సంతోషంగా ఉందన్నారు. హక్కుదారులుగా పత్రాలు తమ జీవితాల్లో ఆనందం నింపాయని, ఈ రోజు మాకు పండుగని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు, జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.