
హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదవుతున్నాయంటే థియేటర్ ముందు భారీ కటౌట్‌లు పెట్టి పాలాభిషేకం చేస్తారు. అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్‌ల వద్ద కటౌట్‌లు పెట్టడం సాధారణమే.
Vijay Devarakonda Massive Cutout At Sudarshan 35MM: హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదవుతున్నాయంటే థియేటర్ ముందు భారీ కటౌట్‌లు పెట్టి పాలాభిషేకం చేస్తారు. అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్‌ల వద్ద కటౌట్‌లు పెట్టడం సాధారణమే. ఇటివల కాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లకు సైతం హీరోల కటౌట్‌లు పెట్టి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుతున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాగే గీత గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది 'లైగర్'. ఈ మూవీకి టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయ్‌కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక 'లైగర్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్‌ఎమ్ థియేటర్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్ వావ్ అనిపించేలా ఉంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం (జులై 21) ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.