Vijay Deverakonda Interesting Comments About Liger Flop And His Comeback, Video Viral - Sakshi
Sakshi News home page

ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ అదే అడుగుతున్నారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్

Published Mon, Nov 7 2022 6:33 PM | Last Updated on Mon, Nov 7 2022 7:38 PM

Vijay Deverakonda Says Fans Ask him to Make a Comeback After Liger failure - Sakshi

లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో విజయ్‌కి జోడీగా అనన్య పాండే నటించింది. ఆదివారం ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్.. లైగర్ ఫ్లాప్‌పై స్పందించారు. లైగర్ సినిమా విడుదల తర్వాత నేను ఎక్కడికెళ్లినా అభిమానులు మంచి కమ్‌ బ్యాక్‌తో రావాలని  అడుగుతున్నారని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా విజయ్ బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశారు. 

(చదవండి: ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?)

ఈ కార్యక్రమంలో విజయ్‌ మాట్లాడుతూ.. 'నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు అన్నా.. నువ్వు మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను మీకు ఒకటే చెప్పాలనుకున్నా. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మళ్లీ తిరిగి వస్తా' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. విజయ్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ తమకు ఉండాలని కోరుకుంటున్నట్లు ఓ అభిమాని కామెంట్ చేశాడు. 

రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ కూడా ఈ చిత్రంలో నటించారు. లైగర్ విడుదలకు ముందే విజయ్, పూరి కలిసి జనగణమన అనే మరో ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం సమంతా రూత్ ప్రభుతో కలిసి తెలుగు రొమాంటిక్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement