చిరంజీవి సినిమా కోసం హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌! | Britney Spears To Croon For Chiranjeevi Godfather Movie | Sakshi
Sakshi News home page

Godfather Movie: చిరంజీవి సినిమా కోసం రంగలోకి హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌!

Oct 13 2021 10:48 AM | Updated on Oct 13 2021 1:25 PM

Britney Spears To Croon For Chiranjeevi Godfather Movie - Sakshi

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, మోహన్‌ రాజాతో గాడ్‌ ఫాదర్‌.. బాబీ డైరెక్షన్‌లో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిరు ఇటీవల ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో గాడ్‌ ఫాదర్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ మూవీలో నటించే హీరోయిన్స్‌, మిగతా తారగణంకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: బిగ్‌బాస్‌ 5: స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌!

ఈ నేపథ్యంలో ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాటలకు మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందుకు హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ను రంగంలోకి దించబోతున్నాడట తమన్‌. బ్రిట్నీ స్పియర్ చేత ఓ పాట పాడించడానికి తమన్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. దీనిపై ఆమెతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే గాడ్‌ ఫాదర్‌ మేకర్స్‌ ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏ పాటకైనా దాదాపు 20 నుంచి 30 కోట్లు రూపాయల పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

చదవండి: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్‌ శ్రియ సరన్‌

ఇంతటి  డిమాండ్‌ ఉన్న బ్రిట్నీ స్పియర్‌తో పాట పాడిస్తారా?  లేక ఇది వార్తలకే పరిమితమవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే మోహన్‌ రాజా ‘గాడ్‌ ఫాదర్‌’ను భారీగా ప్లాన్‌ చేస్తున్నాడట. పరిశ్రమకు చెందిన పలువరు స్టార్లను ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నాడట. ఇప్పటికే ఈ మూవీలో ఓ అతిథి పాత్రకు బాలీవుడ్‌ కండట వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను స్పంద్రించినట్లు గతంలో వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌ కనిపించదని సమాచారం. గాడ్‌ ఫాదర్‌ తర్వాత చిరు బాబీతో భోళా శంకర్ మూవీని ప్రారంభించన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement