
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్ నుంచి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో చిరుతో కలిసి సల్మాన్ స్టెప్పులేశాడు. టార్ మార్ టక్కర్ మార్ అంటూ ఫాస్ట్ బీట్‌తో ప్రొమో అదిరిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొమో సాంగ్ విన్న కొందరు తమన్‌ను సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు. మళ్లీ దొరికిపోయాడంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట అచ్చం రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందని అంటున్నారు.
చదవండి: రణ్‌వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
అయితే ఈ పాటను కంపోజ్ చేసింది కూడా తమనే. దీంతో ‘ఏంటి.. తమన్ నువ్వు ఇక మరావా?.. రెండు పాటలకు ఒకే బీట్ వాడావంటూ’ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘మెగాస్టార్ లాంటి పెద్ద హీరో చిత్రానికి పని చేస్తున్నప్పుడు కొంచం డిఫరేంట్ ఉండాలి కదా’ అని తమన్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రెండు పాటలను పోలుస్తూ నెటిజన్లు ‘ఏంటమ్మా.. తమన్ ఇది చూసుకోవాలి కదా’ అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. కాగా ఇలా కాపీ కొట్టి దొరికపోవడం తమన్‌కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి తమన్ దొరికిపోవడం.. అతడిని నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణమైంది.
చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్
Comments
Please login to add a commentAdd a comment