![Bigg Boss Fame Divi Vadthya Open Up On Casting Couch In Latest Interview - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/Divi-Vadthya.jpg.webp?itok=nLgiLloc)
బిగ్‌బాస్ బ్యూటీ దివి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 4లో హౌజ్‌లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో అందరిని ఆకట్టుకుంది. ఉన్నది కొద్ది రోజులైన హౌజ్‌లో తనదైన మార్క్ వేసుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక దివి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. హీరోయిన్‌గా ప్రస్తుతం ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ 4 సీజన్ ఫినాలేకు అతిథిగా వచ్చిన చిరు.. దివికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం?
చెప్పినట్టుగానే దివికి గాడ్‌ఫాదర్‌లో ఓ కీ రోల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు చిరు. ఇందులో దివి రేణుకగా నటించి మెప్పించింది. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో దివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్న ఎదురైంది. మోడల్‌గా ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టిన మీరు ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యారని, ఈ ప్రయాణంలో ఎప్పుడైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు.
చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా?
దీనిపై దివి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే అలాంటి సమస్యలు నాదాకా రాలేదనుకుంటా. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఇద్దరు(ఒక అమ్మాయి-అబ్బాయి) ఒకరినొకరు ఇష్టపడి కమిట్ అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి.
Comments
Please login to add a commentAdd a comment