అవకాశం.. అదృష్టం కలసిరావడమే సక్సెస్! ఆ కోవలోని నటే దివి వైద్య. ముందు బుల్లితెర అవకాశాన్ని వినియోగించుకుంది, ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్‌ల చాన్స్‌లనూ అందుకుంటోంది. దివి వాళ్లమ్మ, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. తనేమో ఎమ్‌టెక్ పూర్తి చేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తూనే పాకెట్ మనీ సంపాదించుకునేది.
చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. అందుకే నటించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టలేదు. మొదటిసారి ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబుతో ఓ సన్నివేశంలో కనిపించింది. తర్వాత పలు సినిమాలు, కవర్ సాంగ్స్ చేసింది కానీ, అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ సీజన్–4లో పాల్గొనే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. తనదైన ఆట తీరు, ముక్కుసూటితనంతో అందరినీ ఆకట్టుకుంది.
ఫినాలేకు అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన సినిమాలో ఆఫర్ ఇస్తానని మాట ఇవ్వటంతో గాడ్‌ఫాదర్‌తో పాటు వరుస సినిమా ఆఫర్లలనూ అందుకుంటోంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ చాన్స్‌నే కొట్టేసింది. ఆ సినిమా పేరు ‘లంబసింగి’. ప్రస్తుతం ‘జీ5’లో స్ట్రీమ్ అవుతున్న ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎమ్’ సిరీస్‌లతో అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment