Bigg Boss Contestant Shiv Thakare About His Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Shiv Thakare: రాత్రికి రాకపోతే అవకాశాలు రావని బెదిరించారు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన నటుడు

Published Thu, Mar 30 2023 3:37 PM | Last Updated on Fri, Mar 31 2023 8:34 AM

Bigg Boss Contestant Shiv Thakare About His Casting Couch Experience - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 16 సీజన్‌తో ఫుల్‌ పాపులారిటీ తెచ్చుకున్నాడు శివ ఠాక్రే. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడీ యంగ్‌ యాక్టర్‌. అయితే కెరీర్‌ తొలినాళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు. తాజాగా ఇంటర్వ్యూలో శివ ఠాక్రే మాట్లాడుతూ.. 'ముంబైకి వచ్చాక నాకో విషయం అర్థమైంది. సినీఇండస్ట్రీలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలకు గండాలు ఎదురవుతాయని తెలిసొచ్చింది. ఒకసారి నేను ఆరమ్‌ నగర్‌కు ఆడిషన్‌ కోసం వెళ్లాను. డైరెక్టర్‌ నన్ను బాత్రూమ్‌కు తీసుకెళ్లి ఇక్కడ ఒక మసాజ్‌ సెంటర్‌ ఉందని చెప్పాడు.

ఆడిషన్‌కు వస్తే మసాజ్‌ సెంటర్‌ అంటున్నాడేంటి అని తల గోక్కున్నాను. ఆడిషన్‌ అయిపోయాక మసాజ్‌ సెంటర్‌కు రా, నీతో పనుంది అని చెప్పాడు. స్క్రీన్‌పై కనించడం కోసం అప్పటికే ఎంతో కష్టపడుతున్నాను. కానీ అందుకోసం అలాంటి పని చేయడం ఇష్టం లేదు, అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మరోసారి ఓ మహిళ రాత్రి 11 గంటలకు ఆడిషన్‌కు రమ్మని పిలిచింది. తనకు నాలుగు బంగళాలు ఉన్నాయంట. వాళ్లను, వీళ్లను పెద్ద స్టార్లను చేశాను అని నాదగ్గర గొప్పలు చెప్పుకుంది. రాత్రి 11 గంటలకు ఆడిషన్‌ ఉంటుంది, సమయానికి రావాలి అని చెప్పగానే నేను కుదరదన్నాను.

తన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. అర్ధరాత్రి ఆడిషన్‌ ఏంటి? నాకు పని ఉంది, రావడం వీలు కాదని ముఖం మీదే చెప్పేశా. దీనికామె.. నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా? నువ్వు రాత్రికి రాకపోతే నీకు పనే దొరకదు అని బెదిరించింది. అయినా సరే ఆమె మాటలను లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా బిగ్‌బాస్‌ 16వ సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన శివ ఠాక్రే ఇటీవలే బిగ్‌బాస్‌ మరాఠీ, ఎమ్‌టీవీ రోడీస్‌ రైడింగ్‌ షోలలో మెరిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement