Godfather OTT Release Date Locked On This Platform - Sakshi
Sakshi News home page

Godfather OTT Release: ‘గాడ్‌ ఫాదర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

Published Wed, Nov 2 2022 10:55 AM | Last Updated on Wed, Nov 2 2022 11:54 AM

Godfather OTT Release Date Locked on This Platform - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్‌ ఫాదర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. మలయాళ డైరెక్టర్‌ మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌లు కీ రోల్‌ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు గాడ్‌ ఫాదర్‌ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి గాడ్‌ ఫాదర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement