రిస్క్‌గా మారిన రీమేక్స్‌.. అసలు ప్రాబ్లమ్‌ అదే! | Remake Movies Seems To Be a Big Risk For Tollywood Heroes | Sakshi
Sakshi News home page

Remake Movies: రిస్క్‌గా మారిన రీమేక్స్‌.. ఇష్టం లేకున్నా మళ్లీ మళ్లీ!

Aug 6 2022 9:33 AM | Updated on Aug 6 2022 9:33 AM

Remake Movies Seems To Be a Big Risk For Tollywood Heroes - Sakshi

టాలీవుడ్‌ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్‌ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే రాను రాను రీమేక్స్‌లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే క్యారెక్టర్‌ని మాటిమాటికి రిపీట్‌ చేయాల్సి రావడమే అసలు ప్రాబ్లమ్‌గా మారనుంది. 

ఇండియా వైడ్‌గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆనవాయితీగా మారుతోంది. చిరు నటించే గాడ్ ఫాదర్ ఓరిజినల్ వర్షన్ లూసీఫర్ కు త్వరలోనే సీక్వెల్ తెరకెక్కిస్తాంటున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రముఖ హీరో పృథ్వీరాజ్. అదే జరిగితే చిరు మరోసారి గాడ్ ఫాదర్ గా మారాల్సి వస్తోంది.గతంలో మున్నాభాయ్ సిరీస్‌ను రీమేక్స్ చేసిన చిరు, రెండు సార్లు శంకర్ దాదాగా మారాడు.

(చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా)

వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.ఎందుకంటే గద్దలకొండ గణేష్ ఓరిజినల్ వర్షన్ జిగర్తాండ కు సీక్వెల్ అనౌన్స్ చేసాడు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. జిగర్తాండ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మాస్ గా సీక్వెల్ వీడియో రిలీజ్ చేశాడు. సో త్వరలోనే వరుణ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ స్టోరీని కంటిన్యూ చేయాలంటే రీమేక్ చేయకతప్పదు.

ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పటికే  దృశ్యం, దృశ్యం2  చిత్రాల్లో కనిపించాడు వెంకటేశ్‌. త్వరలోనే దృశ్యం 3 తీస్తానంటున్నాడు జీతుజోసెఫ్. సో వెంకీ మళ్లీ దృశ్యం 3 చేయాల్సి ఉంటుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. ఇప్పుడు ఈ సినిమకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఖిల్ కూడా కిరాక్ట్ పార్టీ2తో తిరిగొస్తాడా అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement