Drushyam 2 Movie
-
రిస్క్‌గా మారిన రీమేక్స్.. అసలు ప్రాబ్లమ్ అదే!
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే రాను రాను రీమేక్స్‌లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే క్యారెక్టర్ని మాటిమాటికి రిపీట్ చేయాల్సి రావడమే అసలు ప్రాబ్లమ్‌గా మారనుంది. ఇండియా వైడ్‌గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆనవాయితీగా మారుతోంది. చిరు నటించే గాడ్ ఫాదర్ ఓరిజినల్ వర్షన్ లూసీఫర్ కు త్వరలోనే సీక్వెల్ తెరకెక్కిస్తాంటున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రముఖ హీరో పృథ్వీరాజ్. అదే జరిగితే చిరు మరోసారి గాడ్ ఫాదర్ గా మారాల్సి వస్తోంది.గతంలో మున్నాభాయ్ సిరీస్‌ను రీమేక్స్ చేసిన చిరు, రెండు సార్లు శంకర్ దాదాగా మారాడు. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా) వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.ఎందుకంటే గద్దలకొండ గణేష్ ఓరిజినల్ వర్షన్ జిగర్తాండ కు సీక్వెల్ అనౌన్స్ చేసాడు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. జిగర్తాండ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మాస్ గా సీక్వెల్ వీడియో రిలీజ్ చేశాడు. సో త్వరలోనే వరుణ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ స్టోరీని కంటిన్యూ చేయాలంటే రీమేక్ చేయకతప్పదు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం2 చిత్రాల్లో కనిపించాడు వెంకటేశ్. త్వరలోనే దృశ్యం 3 తీస్తానంటున్నాడు జీతుజోసెఫ్. సో వెంకీ మళ్లీ దృశ్యం 3 చేయాల్సి ఉంటుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. ఇప్పుడు ఈ సినిమకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఖిల్ కూడా కిరాక్ట్ పార్టీ2తో తిరిగొస్తాడా అనేది చూడాల్సి ఉంది. -
‘దృశ్యం 2’ మూవీ రివ్యూ
టైటిల్ : దృశ్యం2 నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ కథ, దర్శకత్వం : జీతు జోసెఫ్ సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్ ఎడిటర్: మార్తాండ్ కే విడుదల తేది : నవంబర్ 25,2021 ఈ ఏడాది ప్రైమ్ లో చాలా కొత్త చిత్రాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే నెటిజన్స్ ను మెప్పించడంతో పాటు ప్రైమ్ కు బోల్డంత పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం 2, మలయాళ వర్షన్. దృశ్యం మొదటి భాగం థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్ ప్రైమ్ లో విడుదలై ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్ నేటి (నవంబర్ 25)నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. దృశ్యం 2 కథేటంటే..? దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలవుతుంది. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితంగా సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత... తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి వరుణ్ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ. ఎవరెలా చేశారంటే..? రాంబాబు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజానా వేసుకొని నడిపించాడు. ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. ఈ మూవీతో వెంకటేశ్ నటుడిగా వెంకటేశ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. నటన పరంగా బాగానే ఉన్నా.. డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై, సూపర్ హిట్ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు దర్శకుడు. మలయాళంలో చివరి వరకు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని తెలుగులో ముందుగానే చెప్పాడు. మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. వరుణ్ కేసును పోలీసులు సీక్రెట్‌గా విచారిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మొత్తంగా దృశ్యం 2’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకొస్తే..అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పితే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వెంకటేశ్ నటన కథ, కథనం సెకండాఫ్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Esther Anil: ‘దృశ్యం’ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
-
తెలుగులో ఇదొక బెస్ట్ థ్రిల్లర్ : వెంకటేశ్
‘‘నేనెప్పుడు కొత్త తరహా సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.. ‘దృశ్యం 2’ని కూడా ఆదరిస్తారు.. ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వెంక టేశ్. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేశ్, మీనా జంటగా నటించిన చిత్రం ‘దృశ్యం 2’. ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి, సురేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 25నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘దృశ్యం 2’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘దృశ్యం’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయాలని ఎప్పుడూ అనుకునేవాణ్ణి.. ‘దృశ్యం 2’ అనే అద్భుతమైన కథతో వచ్చిన జీతూ జోసెఫ్‌కి థ్యాంక్స్. ఇటీవల అలాంటి కథని ఎవరూ తీయలేదు. ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం. మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘దృశ్యం 2’ ని తెలుగులో చేయడం ఓ సవాల్. ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక చాలా సంతోషంగా ఉన్నాను. తెలుగు చిత్రాల్లో ఇదొక బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్’’ అన్నారు. జీతూ జోసెఫ్ మాట్లాడుతూ– ‘‘దృశ్యం 2’ గురించి రాజమౌళి సార్ నాకు మెసేజ్ చేసినప్పుడు హైదరాబాద్‌లో నా ఫ్యామిలీతో కలిసి ఉన్నాను. ఆయన మెసేజ్ చేశారంటే ముందు నమ్మలేదు.. పూర్తి మెసేజ్ చదివాక.. ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన ఆయన మెసేజ్ చేయడంతో అందరం చాలా సంతోషపడ్డాం’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారితో చాలా సినిమాలు చేశాను కాబట్టి కంఫర్ట్ లెవల్ ఎక్కువగా ఉంటుంది. మేం కో స్టార్స్ మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్స్’’ అన్నారు. ‘‘రాంబాబు పాత్రకి వెంకటేశ్ తప్ప ఎవరూ సరిపోరు. ఆయన ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఆ పాత్రలో జీవించారు’’ అన్నారు ‘దృశ్యం’ డైరెక్టర్ శ్రీప్రియ. రాజ్‌కుమార్ సేతుపతి, నటులు ‘సీనియర్’ నరేశ్, సంపత్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత రమేశ్, నటి ఈస్తర్ అనిల్ పాల్గొన్నారు. -
Drushyam 2 : వరుణ్ మర్డర్ కేసు నుంచి రాంబాబు బయటపడ్డాడా?
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం 2’. సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలైంది. ఇందులో వెంకటేశ్ థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వరుణ్ మర్డర్ కేసు విషయంలో రాంబాబు ఫ్యామిలీపై పోలీసు నిఘ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ హత్యను రాంబాబే చేశాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తెలియాలంటే నవంబర్ 25న ‘దృశ్యం 2’ చూడాల్సిందే.