Remake movies
-
OTT Movie Review: ఈ ఆట మామూలుగా ఉండదు
‘ఖేల్ ఖేల్ మే’... ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అనే ఇటలీ సినిమాకి హిందీ రీమేక్ ఇది. ఈ ఇటలీ సినిమా ఇప్పటికే రెండు సార్లు మలయాళంలో మరోపాతిక సార్లు వివిధ దేశాలలో... మొత్తంగా ప్రపంచ దేశాల్లో 27 సార్లు రీమేక్ అయింది. తొలుత ఈ చిత్రాన్ని ఇటలీ దర్శకుడుపావోలో 2016లో తీశారు. ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చోటు సంపాదించుకోవడమే కాదు ఎన్నో అవార్డులు రివార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించుకుంది. ఇక ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా విషయానికి వస్తే... ముదస్సర్ అజీజ్ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.అక్షయ్ కుమార్, తాప్సీ, ఫర్దీన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. కథాపరంగా... ‘ఖేల్ ఖేల్ మే’ చాలా సింపుల్ మరియు సెన్సిబుల్ లైన్. మూడు జంటలు జైపూర్‌లో ఓ పెళ్ళిలో కలుస్తారు. పెళ్ళి ఉదయం కావడంతో రాత్రంతా నిద్రపోవడమెందుకని సరదాగా అందరూ ఓ ఆట ఆడదామనుకుంటారు. ఆ ఆటే ఈ సినిమా. ఆటేమిటంటే... ఉన్న ఆరుమంది కలిసి వాళ్ళ ఫోన్లు టేబుల్ మీద పెట్టి ఆట అయ్యేంతవరకు ఏ ఫోన్లో మెసేజ్ లేక కాల్ వచ్చినా అందరి ముందూ చదవాలి, చూపించాలి. ఇలా ఆట మొదలవగానే ఒక్కొక్కరికి వ్యక్తిగత మెసేజ్, కాల్స్ వస్తుంటాయి.దాంతో వాళ్ళపార్టనర్స్తో వాళ్లకు గొడవలు మొదలవుతాయి. ఈ చిత్రంలో రిషబ్ మాలిక్పాత్రను అక్షయ కుమార్ హుందాగా ΄ోషించారు. మిగిలిన వారందరూ వారిపాత్రలకు న్యాయం చేశారు. మామూలు సూపర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మించి ఉంటుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ఒక్కొక్కరి ఫోన్లో వ్యక్తిగత విషయాలు బయటపడుతూ ఉంటే దానికి వాళ్ళ టెన్షన్ ఒక ఎత్తయితే చూసే ప్రేక్షకుడు అంతకు మించి ఫీలవుతాడు. ఏదేమైతేనేం సినిమా మాత్రం మంచి ఎంటర్టైనర్. ఆఖరుగా ఒక్క మాట... ఈ సినిమా చూసేంతవరకు అయితే ఫర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం దీనిని ఆడవద్దని మనవి. ఎందుకంటే ఈ ఆట మామూలుగా ఉండదు. – ఇంటూరు హరికృష్ణ -
అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక తెలుగు హిట్ సినిమా ఏదో తెలుసా..?
మంచి కథ ఉంటే ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనేది నిజం. అందుకే అలాంటి కథలు ఏ భాషలో దొరికినా రీమేక్‌ల రూపంలో వాటిని మళ్లీ తెరకెక్కించి విడుదల చేస్తారు మేకర్స్. ఇప్పుడంటే ఈ ట్రెండ్ కాస్త తగ్గినప్పటికీ గతంలో ఎక్కువగా అరువు కథలకే ఎక్కవగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా నాలుగైదు భాషల్లోకి రీమేక్ కావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ టాలీవుడ్లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు దీనిని నిర్మించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి చిక్కులు వచ్చాయి అనేది ఈ చిత్రం కథ. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. 35 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది. తొమ్మిది భాషల్లో రీమేకైన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయింది. ఏ భాషలో ఏ పేరుతో విడుదలైందో మీరూ తెలుసుకోండి. 1. ఉనక్కం ఎనక్కం (తమిళం) 2. నీనెల్లో నానల్లే (కన్నడ) 3. రామయ్య వస్తావయ్యా (హిందీ) 4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా) 5. నింగోల్ తజబ(మణిపురి) 6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ) 7. ఐ లవ్ యు (బెంగాలీ) 8. నిస్సా అమర్ తుమీ (బంగ్లాదేశ్ బెంగాలీ) 9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ) -
రీమేక్ మూవీతో రిస్క్ చేస్తున్న రవితేజ
-
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్‌లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
'రీమేక్స్'... చిరుకు కలిసొచ్చాయా? ముంచేశాయా?
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఓ తమిళ మూవీకి రీమేక్. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఇది ఫలానా మూవీకి రీమేక్ అని మెగా ఫ్యాన్స్‌కి తెలిసింది. దీంతో మాకొద్దీ రీమేక్ అని బుర్ర బాదుకున్నారు. కానీ వాళ్ల మాట ఎవరు వింటారు చెప్పండి. ఎంచక్కా షూటింగ్ పూర్తి చేసి, సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 'భోళా శంకర్' బోల్తా కొట్టింది. చిరు కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే రీమేక్స్ చేయొద్దని.. స్వయానా అభిమానులే అంత మొత్తుకుంటున్నా చిరు ఎందుకు రీమేక్స్ చేస్తున్నారు? అసలు ఆయన కెరీర్లో ఓవరాల్‌గా ఎన్ని రీమేక్ సినిమాలున్నాయి? అదంత పక్కనబెడితే రీమేక్ అనేది మెగాస్టార్‌కి కలిసొచ్చిందా? ముంచేసిందా అనేది ఇప్పుడు అలా చూసేద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) రీమేక్స్ ఎన్ని? శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. 'మెగాస్టార్' ఎందుకయ్యారు? అని ఎవరినైనా అడిగితే.. ఏముంది డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్స్ ఇలా ప్రతిదానిలోనూ బెంచ్ మార్క్ సెట్ చేశారు కదా అని చెబుతారు. చిరు ఇప్పటివరకు 155 సినిమాలు చేస్తే.. అందులో దాదాపు 38కి పైగా చిత్రాలు రీమేక్స్ అని చాలామందికి తెలియదు. ఓర్ని ఇన్ని రీమేక్సా అని ఆశ్చర్యపోవద్దు. ఇంతకీ ఆ మూవీస్ ఏంటో తెలుసా? ఖైదీ కూడా రీమేక్? చిరు కెరీర్‌ని టర్న్ చేసిన మూవీ అనగానే చాలామంది 'ఖైదీ' అంటారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి తీసిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరు కెరీర్‌కి బ్యాక్ బోన్‌లా మారింది. అయితే ఇది హాలీవుడ్లో సిల్వోస్టర్ స్టాలిన్ చేసిన 'ఫస్ట్ బ్లడ్' అనే చిత్రానికి రీమేక్ అట. పూర్తిగా ఉన్నది ఉన్నట్లు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చి తీసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా లిస్టులో చాలా ఉన్నాయి. (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) రీమేక్స్- ఒరిజినల్ సినిమాలు పున్నమినాగు- హున్నిమేయ రాత్రియల్లి (మలయాళం) పట్నం వచ్చిన పతివ్రతలు - పట్టణక్కే బంధ పత్నియారు (కన్నడ) అడవి దొంగ - టార్జాన్ (ఇంగ్లీష్) వేట - ది కౌంట్ ఆఫ్ మొంటో క్రిష్ణో (ఇంగ్లీష్) ఆరాధన- కవితోరా కవితైగల్ (తమిళం) పసివాడి ప్రాణం - పూవిన్ను పుతియా పుంతెన్నెల్ (మలయాళం) ఘరానా మొగుడు - అనురాగ అరాలితు (కన్నడ) ఎస్పీ పరశురాం - వాల్టర్ వెట్రివేల్ (తమిళం) హిట్లర్ - హిట్లర్ (మలయాళం) స్నేహం కోసం - నట్పుక్కగ (తమిళం) ఠాగూర్ - రమణ (తమిళం) అంజి - ఇండియానా జోన్స్ (ఇంగ్లీష్) శంకర్‌దాదా ఎంబీబీఎస్ - మున్నాభాయ్ ఎంబీబీఎస్ (హిందీ) ఖైదీ నం.150 - కత్తి (తమిళం) గాడ్‌ఫాదర్ - లూసిఫర్ (మలయాళం) భోళా శంకర్ - వేదాళం (తమిళం) పొరపాటు ఎక్కడ? పైన చెప్పిన సినిమాలన్నీ చిరంజీవి కెరీర్లో కాస్త చెప్పుకోదగ్గ రీమేక్స్. వీటితోపాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో రీమేక్స్ హక్కులు కొని తీయడం అనే పద్ధతి ఉండేది కాదు. దీంతో దర్శకులు.. సదరు చిత్రాల్ని స్పూర్తిగా తీసుకుని కాస్త చేర్పులు మార్పులు చేసి తీసేసేవారు. కాబట్టి అది రీమేక్, ఒరిజినల్ అనేది చెప్పడం కష్టం. అప్పట్లో ప్లస్ అయినంతగా ఇప్పుడు చిరుకు రీమేక్స్ అస్సలు కలిసి రావడం లేదు. రీమేక్స్.. నాట్ ఇంట్రెస్ట్! ఇప్పటి ప్రేక్షకులు.. ఒరిజినల్ సినిమాలు చూడటానికే కొన్నిసార్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీమేక్స్ అనేసరికి చూడటం కంటే ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రకటన రావడం ఆలస్యం ఒరిజినల్ చూసేసి, రీమేక్‌ని దాంతో పోల్చుతూ విమర్శిస్తున్నారు. రీసెంట్గా 'భోళా శంకర్' రిజల్ట్ దీనికి కరెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. రీఎంట్రీలో రీమేక్స్ చిరంజీవి.. 'ఖైదీ నం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది తమిళ 'కత్తి'కి రీమేక్. మాస్ కమర్షియల్ అంశాలు ఉండటంతో ఇది మెగాస్టార్‌కి కలిసొచ్చింది. కానీ 'గాడ్ ఫాదర్' (లూసిఫర్), 'భోళా శంకర్' (వేదాళం) చిత్రాలు మాత్రం చిరుకు కలిసి రాలేదు. ఎందుకంటే వాటిని ఆల్రెడీ ఆడియెన్స్ చూసేశారు కాబట్టి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు.. ఆడియెన్స్ టేస్ట్, ట్రెండ్‌కి తగ్గట్లు చిరు మారితే బెటర్. లేదంటే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులే ఎక్కువ! (ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?) -
మహేశ్ 'రీమేక్స్' అస్సలు చేయడు.. ఎందుకో తెలుసా?
తెలుగులో లెక్కలేనంత మంది హీరోలున్నారు. అందులో స్టార్స్ ఓ 10-15 మంది వరకు ఉంటారు. వీళ్లలో చాలామంది రీమేక్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా లిస్ట్ తీస్తే చాలావరకు రీమేక్స్ చేశారు. అయితే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి రీమేక్ చేయలేదు. చాలామందికి దీని గురించి తెలిసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేయడనేది మాత్రం పెద్దగ తెలియకపోవచ్చు. నో రీమేక్స్ మహేశ్ కెరీర్ చూస్తే డిఫరెంట్ జానర్స్ అన్ని ట్రై చేశాడు. ప్రస్తుతం 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడు. అయితే మహేశ్ రీమేక్ సినిమాలకు వ్యతిరేకం. ఒరిజినల్ కథలు చెప్పాలనేది ఇతడి ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కథని మళ్లీ చెప్పడం, ఒకరు చేసిన ఫెర్ఫార్మెన్స్ రిపీట్ చేయడం మహేశ్ కి ఇష్టం ఉండదట. స్వయంగా దీని గురించి మహేశ్ ఓ సందర్భంలో మాట్లాడాడు. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!) కారణం అదే 'అప్పటికే ఓ సినిమా చూసిన తర్వాత సెట్స్ కి వెళ్తే.. నాకు అందులో ఆ హీరోనే కనిపిస్తాడు. ఆ హీరో చేసినట్లు చేయాలా? లేదంటే సొంతంగా చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతాను. అందుకే వీలైనంత వరకు వాటికి నో చెబుతుంటాను. అందుకే రీమేక్స్ చేయనని చెబుతుంటాను. అయితే నేను చేసిన మూవీస్ ఇతర భాషల్లో రీమేక్ కావాలని అనుకుంటున్నా' అని మహేశ్‌బాబు చెప్పుకొచ్చాడు. సో అదనమాట విషయం. కొత్త లుక్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' నుంచి మరో లుక్ ని బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో నోటిలో బీడీ, గళ్ల లుంగీతో మహేశ్ కనిపించాడు. ఈ ఫొటో బాగానే ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం లిరికల్ సాంగ్, గ్లింప్స్ వీడియో వస్తుందని ఆశించారు. కేవలం పోస్టర్ మాత్రమే అనేసరికి డిసప్పాయింట్ అయ్యారు. రిలీజ్ తేదీలోనూ మార్పు జరిగింది. జనవరి 13న కాకుండా ఓ రోజు ముందు అంటే 12వ తేదీన సినిమా థియేటర్లలోకి రానుంది. Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh 🤩#HBDSuperstarMaheshBabu ✨ Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉 #GunturKaaramOnJan12th… pic.twitter.com/lOzhJBZx1l — Guntur kaaram (@GunturKaaram) August 8, 2023 (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) -
టాలీవుడ్ ని షేక్ చేస్తున్న మెగా రూమర్
-
ఆ విషయంలో చిరుపై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్!
ఒకవైపు రామ్ చరణ్ రీమేక్స్ లో నటించడం రిస్క్ అంటాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రీమేక్స్ అంటేనే ఇంట్రెస్ట్ అంటున్నాడు. చిరంజీవి ఇప్పటికే చాలా రీమేక్స్ లో నటించాడు. ఇప్పుడు మరో రెండు రీమేక్స్ తో తిరిగొస్తానంటున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు. తమిళనాడులో అజిత్ సినిమాలు దుమ్మురేపుతుండటం చూసి, చిరు ఈ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. వీటిని తన ఇమేజ్ తగ్గట్లు మార్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వేదాళం చిత్రాన్ని చిరు ‘భోళాశంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు వినాయక్ చేతికి అజిత్ నటించిన విశ్వాసం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఒక వైపు స్ట్రెయిట్ గా మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.150 కోట్లు వసూళ్లు దాటి పరుగులు తీస్తుంటే, మళ్లీ చిరు రీమేక్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ బాధపడుతున్నారు. వేదాళం, విశ్వాసం చిత్రాల తర్వాత అజిత్ నటించిన మరో సినిమా ఎంతవాడు గాని తెలుగు రీమేక్ లో చిరు నటించాలనుకున్నాడు. -
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
సుశాంత్ సింగ్ నటించిన ఆ సినిమా రీమేక్‌లో రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే చిత్రాల గురించి ప్రస్తావించగానే ఆయన అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వస్తుంది. అయితే ఇటీవల సక్సెస్ ఆయనతో దోబూచులాడుతుందనే చెప్పాలి. బాషా, పడయప్పా, రోబో లాంటి హిట్ కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జైలర్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నటి రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తదుపరి రజనీకాంత్ లైకా ప్రొడక్షన్స్‌లోనే వరుసగా రెండు చిత్రాలు చేయబోతున్నారు. అందులో ఒక చిత్రానికి డాన్ చిత్రం ఫేమ్ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. రెండో చిత్రానికి రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. దీనికి లాల్ సలాం అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించనున్నారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అతిథి పాత్రే అయినా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచా రం ఏమిటంటే హిందీలో సుశాంత్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం కైపో చేకు రీమేక్ అని. క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ అంశాలతో పాటు మతపరమైన వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించేది హిందీ చిత్రం కైపో చేకు రీమేక్ అయితే కచ్చితంగా సంచలనాత్మక కథా చిత్రమే అవుతుంది. -
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్ర రీమేక్‌లో శృతిహాసన్?
అగ్ర కథానాయకులు కమల్ హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరంభ దశలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో కొన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలు, హీరోయిన్ కథా చిత్రాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘అవళ్ అప్పడిదాన్’. అందులో కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ ప్రధాన పాత్ర పోషించారు. సీ.రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ పలు సమస్యలను ఎదురొడ్డి ఎలా నెగ్గుకొచ్చింది అన్నదే ఈ చిత్ర కథ. చదవండి: తారక్‌పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే.. అందులో కథానాయకి పాత్రలో శ్రీప్రియ నటించింది. కాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అధర్వ, సమంత జంటగా బానాకాత్తాడి చిత్రాన్ని తెరకెక్కించిన బద్రి అవళ్ అప్పడిదాన్ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే ఇటీవల స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతిహాసన్, రజనీకాంత్ పాత్రలో శింబు, కమలహాసన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్‌లను నటింప చేయడానికి ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
రిస్క్‌గా మారిన రీమేక్స్.. అసలు ప్రాబ్లమ్ అదే!
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే రాను రాను రీమేక్స్‌లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే క్యారెక్టర్ని మాటిమాటికి రిపీట్ చేయాల్సి రావడమే అసలు ప్రాబ్లమ్‌గా మారనుంది. ఇండియా వైడ్‌గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆనవాయితీగా మారుతోంది. చిరు నటించే గాడ్ ఫాదర్ ఓరిజినల్ వర్షన్ లూసీఫర్ కు త్వరలోనే సీక్వెల్ తెరకెక్కిస్తాంటున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రముఖ హీరో పృథ్వీరాజ్. అదే జరిగితే చిరు మరోసారి గాడ్ ఫాదర్ గా మారాల్సి వస్తోంది.గతంలో మున్నాభాయ్ సిరీస్‌ను రీమేక్స్ చేసిన చిరు, రెండు సార్లు శంకర్ దాదాగా మారాడు. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా) వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.ఎందుకంటే గద్దలకొండ గణేష్ ఓరిజినల్ వర్షన్ జిగర్తాండ కు సీక్వెల్ అనౌన్స్ చేసాడు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. జిగర్తాండ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మాస్ గా సీక్వెల్ వీడియో రిలీజ్ చేశాడు. సో త్వరలోనే వరుణ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ స్టోరీని కంటిన్యూ చేయాలంటే రీమేక్ చేయకతప్పదు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం2 చిత్రాల్లో కనిపించాడు వెంకటేశ్. త్వరలోనే దృశ్యం 3 తీస్తానంటున్నాడు జీతుజోసెఫ్. సో వెంకీ మళ్లీ దృశ్యం 3 చేయాల్సి ఉంటుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. ఇప్పుడు ఈ సినిమకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఖిల్ కూడా కిరాక్ట్ పార్టీ2తో తిరిగొస్తాడా అనేది చూడాల్సి ఉంది. -
సత్యరాజ్ లీడ్‌లో 'బదాయి హో' రీమేక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Badhaai Ho Movie Remake Veetla Vishesham Release Date Announced: ఆర్జే బాలాజీ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'వీట్ల విశేషం'. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో జీ.స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పీ, రోమియో పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జే బాలాజీ గురువారం (జూన్ 3) మీడియాతో మాట్లాడుతూ ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రమన్నారు. 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హిందీ చిత్రం బదాయ్ హోకు ఇది రీమేక్ అని, అయితే ఇప్పటి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు సత్యరాజ్, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో నటి అపర్ణ బాలమురళి తనకు జంటగా నటించారని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
వెంకీ మామ చేతిలో మరో రీమేక్.. ఆ 'లైసెన్స్' వస్తుందా ?
Victory Venkatesh Another Remake Film Is Driving License: విభిన్న కథా చిత్రాలతో విజయపథంలో దూసకుపోతున్నారు విక్టరీ వెంకటేశ్. కథ నచ్చితే మల్టీ స్టారర్, రీమేక్ చిత్రాలు చేయడానికి అస్సలు వెనుకాడరు. ఇటీవల మలయాళ రీమేక్ చిత్రం 'దృశ్యం 2'తో సూపర్ సక్సెస్ అందుకున్నారు వెంకీ మామ. టాలీవుడ్లో రీమేక్ చిత్రాలకు పెట్టింది పేరు వెంకటేశ్. సుమారు 25కుపైగా రీమేక్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి వెంకీ మామ సిద్ధంగా ఉన్నారని సమాచారం. మలయాళంలో హిట్ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు. మొదట వెంకటేష్, రవితేజలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో 'డ్రైవింగ్ లైసెన్స్'ను తెరకెక్కించడం ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ చిత్రం రామ్ చరణ్ నుంచి గీతా ఆర్ట్స్ చేతికి వచ్చిందని సమాచారం. వెంకటేశ్‌తో ఈ సినిమా తీయాలని గీతా ఆర్ట్స్ భావిస్తోందట. రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యంగ్ హీరోను తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ మామ 'ఎఫ్ 3'తో పాటు ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. వాటి తర్వాత 'డ్రైవింగ్ లైసెన్స్' కోసం కష్ట పడతారని సమాచారం. ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం' -
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
అవార్డు విన్నింగ్ రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరో!
Bandla Ganesh: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్న ఆయన ఇటీవల మళ్లీ నటుడుగా తన కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల హీరోగా మారబోతున్నాడు. తమిళంలో ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘ఒత్త సెరప్పు సైజ్ 7’ మూవీ రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హీరో పాత్ర కోసం బండ్ల గణేష్ ప్రత్యకంగా మేకోవర్ అవుతున్నాడు. తమిళ హిట్, జాతీయ అవార్డులు సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు ఇది తెలుగు రీమేక్. చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు -
తెలుగు సినిమాలపై బాలీవుడ్ కన్ను.. స్పెషల్ వీడియో
ఒకప్పుడు తెలుగులో మిగతా భాష చిత్రాలు రీమేక్ లేదా డబ్ అవ్వడం జరిగేది. ఇతర పరిశ్రమలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపేవే కాదు. ముఖ్యంగా బాలీవుడ్. హిందీలో మన సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు భాష చిత్రాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మన సినిమాలు బి-టౌన్లో భారీ స్థాయిలో మార్కెట్ చేయడంతో బాలీవుడ్ వరుస పెట్టి మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్ హక్కులను సొంతంగా చేసుకున్న బి-టౌన్ మరిన్ని చిత్రాలను కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. మరీ రీమేక్ కోసం బాలీవుడ్ కన్నేసిన మన తెలుగు సినిమావో ఓ లుక్కేద్దాం. -
చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు?
ఒకవైపు తెలుగు సినిమాలు భారతీయ చిత్ర రంగంలో దూసుకెళ్తుంటే.. మన స్టార్ హీరోలు మాత్రం పర భాష చిత్రాలనే నమ్ముకుంటున్నారు. ఫలితంగా రీమేక్‌ల హవా పెరిగిపోయింది.ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్‌లనే నమ్ముకుంటున్నారు. తమిళ, మలయాళంలో హిట్టైన కథనలను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవీ మొదలు... యంగ్ హీరో నితిన్ వరకు అంతా రీమేక్ చిత్రాలనే నమ్ముకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే రెండు రీమేక్ చిత్రాలను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి కూడా రీమేక్ చిత్రాన్నే నమ్ముకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమాని ‘వకీల్‌సాబ్’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో చిత్రం కూడా రీమేకే కావడం గమనార్హం. రానా, పవన్ కల్యాణ్ ముఖ్యపాత్రలో మలయాళం మూవీ ‘అయ్యప్పనున్ కోషియమ్’ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లతో ఎక్కువ హిట్స్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ ఇప్పటికీ అదే సూత్రాన్ని నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు చిత్రాలు రీమేకులే. వాటిలో ఒకటి ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘అసురన్’. ఈ మూవీని ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. మరో చిత్రం మలయాళం చిత్రం ‘దృశ్యం-2’. అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇవి రెండూ కాకుండా తాజాగా మరొక మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ను కూడ ఆయన రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక యంగ్ హీరో నితిన్ కూడా రీమేక్ చిత్రాన్నే నమ్ముకున్నాడు. ఈ ఏడాది ‘చెక్’, ‘రంగ్‌దే’ చిత్రాలతో అలరించిన నితిన్.. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’కి రీమేక్. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ ‘కర్ణన్’ను రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలు చాలామంది రీమేక్ కథల నమ్ముకుంటున్నారు. రీమేక్‌లను నమ్ముకుంటే సేఫ్ జోన్లో ఉండొచ్చని నిర్మాతల మాట. బాక్సాఫీస్ బద్దలైయ్యే కాసుల వర్షం రాకపోవచ్చు కానీ, నష్టమైతే రాదని వారి అంచనా. అందుకే మన నిర్మాతలు రీమేక్‌లను నమ్ముకుంటున్నారేమో. అదీ కాక మన రచయితలు అవసరమైన కథలను అందించలేకపోతున్నారా? లేదా అగ్రహీరోలు వాటిని టేకాప్ చేయడం లేదా?అనేది తెలియడం లేదు. -
ఐశ్వర్య రాజేష్ రీమేక్ మూవీలను ఎందుకు తిరస్కరిస్తోంది?
బహుభాష నటిగానే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటి ఐశ్వర్య రాజేష్. తమిళంలో కనా, క.పే.రణసింగం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర తమిళ రీమేక్‌లో ఈమె నటిస్తున్నారు. నటుడు రాహుల్ రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కారైక్కుడి లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ ఇందులో నటించడం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా చిత్రాలను రీమేక్ చేయడం సులభమైన విషయం కాదన్నారు. అదేవిధంగా చిత్రానికి ఒరిజినల్ ఫీల్ తీసుకురావడం కష్టం అన్నారు. అందుకే తాను పలు రేమేక్ చిత్రాలను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కచ్చితంగా నటించాలని భావించానన్నారు. కారణం ఈ చిత్రంలో సమాజానికి అవసరమైన మంచి సందేశం ఉందన్నారు. తాను ఇంతకుముందు క.పే.రణసింగం చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక యువతని కలిసి ఉన్నాను. ఆమెకు పెళ్లంటే తెలియని వయసులోనే వివాహం జరిగిపోయిందన్నారు. సమాజంలో మహిళల అభిప్రాయాలకు విలువ లభించని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. చదవండి: ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు -
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్‌ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
నారప్పకు బ్రేక్ లేదు
కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో షూటింగ్‌లు మొదలుపెట్టారు. సీనియర్ హీరోల్లో నాగార్జున ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటుండగా తాజాగా వెంకటేశ్ కూడా ‘నారప్ప’ చిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. నవంబర్ మొదటి వారం నుంచి ఆయన ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రాన్నే తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’ 25 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనాతో షూటింగ్ పూర్తికాలేదు. నవంబర్‌లో మొదలుపెట్టే షెడ్యూల్‌ని బ్రేక్ లేకుండా సినిమా పూర్తయ్యేవరకూ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేసిందని సమాచారం. -
హిందీలోకి అయ్యప్పనుమ్ కోషియుమ్
ఈ ఏడాది మలయాళం బాక్సాఫీస్ వద్ద ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం బంపర్‌హిట్ సాధించింది. దాదాపు 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇతర ఇండస్ట్రీ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. పృథ్వీరాజ్, బిజు మీనన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్నారు. ‘‘స్టోరీ, యాక్షన్, థ్రిల్ అంశాలను ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రంలో బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాని మా సంస్థ (జేఏ ఎంటర్టైన్మెంట్స్)లో రీమేక్ చేయబోతున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు జాన్ అబ్రహాం. మరి.. ఈ సినిమాలో ఆయన నటిస్తారా? లేక వేరే నటుడిని నటింపజేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఓ మాజీ హవల్దార్, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మధ్య తలెత్తే ఈగో నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో కూడా రీమేక్ కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ అగ్రనిర్మాత ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారని సమాచారం. మరోవైపు తమిళంలో కూడా ఓ నిర్మాత రీమేక్ చేయనున్నారట. -
రీమేక్ కుమార్
ఏడాదికి మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తారు అక్షయ్ కుమార్. దేశభక్తి, యాక్షన్, సోషల్ మెసేజ్, మల్టీస్టారర్ కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారాయన. అప్పుడప్పుడు రీమేక్ సినిమాల్లోనూ మెరుస్తుంటారు. కానీ, ఇటీవల అక్షయ్ కుమార్ సినిమాల ఎంపిక చూస్తుంటే... ఆయన ఆసక్తి రీమేక్స్ మీదకు మళ్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న 5 సినిమాల్లో 3 రీమేక్సే కావడం విశేషం. తమిళంలో హిట్ అయిన ‘వీరమ్’ ఆధారంగా ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నారు. సౌత్ ఆడియన్స్‌ను భయపెట్టిన ‘కాంచన’ను ‘లక్ష్మీబాంబ్’గా చుడుతున్నారు. తాజాగా ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అధికారికంగా ‘బెల్‌బాటమ్’ చిత్రానికి రీమేక్ కాకపోయినా, ఆ సినిమా స్ఫూర్తిగా సాగనుందని టాక్. ఆ చిత్ర విశేషాలేంటో చదువుదాం. లక్ష్మీ బాంబ్ హారర్–కామెడీ సినిమాల్లో ‘కాంచన’ సిరీస్ సౌత్‌లో సూపర్ సక్సెస్ఫుల్. అన్యాయంగా హత్య చేయబడ్డ ఓ వ్యక్తి ఆత్మ రాఘవ లారెన్స్ శరీరంలోకి ప్రవేశించి తన పగను తీర్చుకోవడం అనేది ఈ సిరీస్‌లోని సినిమాల కథ. అన్యాయానికి గురై హత్య చేయబడ్డ ఓ హిజ్రా ఆత్మగా మారి ఎలా పగ తీర్చకుందనేది ‘కాంచన 2’ సినిమా కథ. ‘కాంచన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో లారెన్స్‌కి ఇదే తొలి సినిమా. 2020 జూన్ నెలాఖరులో ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్‌లో పేలనుంది. వీరమ్– బచ్చన్ పాండే ఒక ఊరిలో పంచ పాండవుల్లాంటి అన్నదమ్ములు. నలుగురు తమ్ముళ్లంటే అన్నయ్యకు వల్లమాలిన ప్రేమ. పెళ్లి చేసుకుంటే అన్మదమ్ముల అనుబంధం దెబ్బతింటుందేమోనని వద్దనుకుంటాడు. తమ్ముళ్లను కూడా అదే ఫాలో అవ్వమంటాడు. అన్న చాటుగా పెరిగిన తమ్ముళ్లు అన్నకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. తమ ప్రేమలకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే అన్నయ్య కూడా ప్రేమలో పడాలని తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అందరూ కలసి అన్న మనసు మార్చారా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది ‘వీరమ్’ కథాంశం. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘కాటమరాయుడు’ టైటిల్‌తో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. ఈ చిత్ర హిందీ రీమేక్ ‘బచ్చన్ పాండే’ 2020 క్రిస్మస్కు విడుదల కానుంది. బెల్ బాటమ్ జేమ్స్‌బాండ్ సినిమాలు, డిటెక్టివ్ సినిమాలు విపరీతంగా చూసి, క్రైమ్ నవలలు బాగా చదివి డిటెక్టివ్‌ల మీద ఒకలాంటి ఇష్టం ఏర్పరచుకుంటాడు హీరో. వృత్తికి కానిస్టేబుల్ అయినా డిటెక్టివ్‌గా ఫీల్ అవుతాడు. ఓ మర్డర్ మిస్టరీని అవలీలగా పరిష్కరిస్తాడు. దీంతో ఓ భారీ దొంగతనం కేసును పరిష్కరించే బాధ్యతని హీరోకి అప్పచెబుతుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్లని ఎలా పట్టుకున్నాడన్నదే ‘బెల్ బాటమ్’ కథాంశం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జయ తీర్థ తెరకెక్కించారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘బెల్ బాటమ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు అక్షయ్. 2021 జనవరిలో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్‌కు కథలు అవసరమున్నప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ కథలు ఇస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సక్సెస్‌పుల్ స్టార్ట్ (తెలుగు ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్’గా రీమేక్ చేశారు) ఇచ్చింది రీమేకే. బాలీవుడ్‌కు తొలి వంద కోట్ల గ్రాసర్‌ని ఇచ్చింది (గజిని) సౌత్ రీమేకే. కథ కావాల్సినప్పుడల్లా బాలీవుడ్‌ను పలకరించే దక్షిణాది బంధువు రీమేకే. గత రీమేక్‌లు అక్షయ్ కుమార్ గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోడ్’గా, తమిళ ‘రమణ’ చిత్రాన్ని ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా, తమిళ ‘తుపాకి’ చిత్రాన్ని ‘హాలిడే’గా, మలయాళ ‘మణిచిత్రతాళ్’ సినిమాను ‘భూల్ బులయ్య’గా, మలయాళ ‘రామ్‌జీ రావ్ స్పీకింగ్’ను ‘హేరా ఫేరీ’గా రీమేక్ చేశారు. కత్తి పట్టనున్నారు ఏఆర్ మురగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘కత్తి’. మల్టీనేషనల్ కంపెనీల ప్రభావం సామాన్య రైతుల మీద ఎలా పడుతోంది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తారని తెలిసింది. ఏఆర్ మురగదాస్ దగ్గర పనిచేసిన జగన్ శక్తి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. -
కామెడీ గ్యాంగ్‌స్టర్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు హీరో సుమంత్. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్న ఈయన తాజాగా ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు. 2018లో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో సుమంత్ హీరోగా నటించనుండగా విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నారు. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఐమా అనే కొత్త హీరోయిన్ పరిచయం కానున్నారు. ‘‘గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షి. రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను. -
బై బై జాను
తనకు చాలెంజ్ విసిరిన మరో పాత్రను విజయవంతంగా పూర్తి చేశానంటున్నారు సమంత. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం ‘96’కి తెలుగు రీమేక్ ఇది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సి.ప్రేమ్‌కుమారే తెలుగు రీమేక్‌నూ తెరకెక్కిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు సమంత. ‘‘నా కెరీర్లో మరో ప్రత్యేకమైన సినిమాను పూర్తి చేశాను. నాలోని నటిని మెరుగుపరచుకునేలా నన్ను చాలెంజ్ చేసిన ఈ సినిమాలోని పాత్రను ముగించాను. మంచి చిత్రబృందంతో పని చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సమంత. ఈ చిత్రంలో సమంత పాత్ర పేరు జానకి కావడంతో ముద్దుగా జాను అని పిలుస్తారని సమాచారం. సో.. జాను పాత్రకు సమంత బై బై చెప్పేశారన్నమాట. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.