OTT Movie Review: ఈ ఆట మామూలుగా ఉండదు | Khel Khel Mein Remake Of Perfect Strangers: Know About The Italian Film Acclaimed As The Most Remade Movie | Sakshi
Sakshi News home page

Khel Khel Mein Review Telugu: ఈ ఆట మామూలుగా ఉండదు

Published Sun, Oct 20 2024 4:13 AM | Last Updated on Sun, Oct 20 2024 7:31 AM

Khel Khel Mein Remake Of Perfect Strangers: Know About The Italian Film Acclaimed As The Most Remade Movie

‘ఖేల్‌ ఖేల్‌ మే’...  ‘పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌’ అనే ఇటలీ సినిమాకి హిందీ రీమేక్‌ ఇది. ఈ ఇటలీ సినిమా ఇప్పటికే రెండు సార్లు మలయాళంలో మరోపాతిక సార్లు వివిధ దేశాలలో... మొత్తంగా ప్రపంచ దేశాల్లో 27 సార్లు రీమేక్‌ అయింది. తొలుత ఈ చిత్రాన్ని ఇటలీ దర్శకుడుపావోలో 2016లో తీశారు. ఈ సినిమా ఎన్నో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో చోటు సంపాదించుకోవడమే కాదు ఎన్నో అవార్డులు రివార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించుకుంది. ఇక ‘ఖేల్‌ ఖేల్‌ మే’ సినిమా విషయానికి వస్తే... ముదస్సర్‌ అజీజ్‌ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అక్షయ్‌ కుమార్, తాప్సీ, ఫర్దీన్‌ ఖాన్, ప్రగ్యా జైస్వాల్‌ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నటించారు. కథాపరంగా... ‘ఖేల్‌ ఖేల్‌ మే’ చాలా సింపుల్‌ మరియు సెన్సిబుల్‌ లైన్‌. మూడు జంటలు జైపూర్‌లో ఓ పెళ్ళిలో కలుస్తారు. పెళ్ళి ఉదయం కావడంతో రాత్రంతా నిద్రపోవడమెందుకని సరదాగా అందరూ ఓ ఆట ఆడదామనుకుంటారు. ఆ ఆటే ఈ సినిమా. ఆటేమిటంటే... ఉన్న ఆరుమంది కలిసి వాళ్ళ ఫోన్లు టేబుల్‌ మీద పెట్టి ఆట అయ్యేంతవరకు ఏ ఫోన్‌లో మెసేజ్‌ లేక కాల్‌ వచ్చినా అందరి ముందూ చదవాలి, చూపించాలి. ఇలా ఆట మొదలవగానే ఒక్కొక్కరికి వ్యక్తిగత మెసేజ్, కాల్స్‌ వస్తుంటాయి.

దాంతో వాళ్ళపార్టనర్స్‌తో వాళ్లకు గొడవలు మొదలవుతాయి. ఈ చిత్రంలో రిషబ్‌ మాలిక్‌పాత్రను అక్షయ కుమార్‌ హుందాగా ΄ోషించారు. మిగిలిన వారందరూ వారిపాత్రలకు న్యాయం చేశారు. మామూలు సూపర్‌ యాక్షన్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ మించి ఉంటుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ఒక్కొక్కరి ఫోన్‌లో వ్యక్తిగత విషయాలు బయటపడుతూ ఉంటే దానికి వాళ్ళ టెన్షన్‌ ఒక ఎత్తయితే చూసే ప్రేక్షకుడు అంతకు మించి ఫీలవుతాడు. ఏదేమైతేనేం సినిమా మాత్రం మంచి ఎంటర్‌టైనర్‌. ఆఖరుగా ఒక్క మాట... ఈ సినిమా చూసేంతవరకు అయితే ఫర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం దీనిని ఆడవద్దని మనవి. ఎందుకంటే ఈ ఆట మామూలుగా ఉండదు.   

– ఇంటూరు హరికృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement