బై బై జాను | Samantha Akkineni wraps 96 Telugu remake Janu | Sakshi
Sakshi News home page

బై బై జాను

Published Mon, Oct 14 2019 12:19 AM | Last Updated on Mon, Oct 14 2019 12:19 AM

Samantha Akkineni wraps 96 Telugu remake Janu - Sakshi

సమంత

తనకు చాలెంజ్‌ విసిరిన మరో పాత్రను విజయవంతంగా పూర్తి చేశానంటున్నారు సమంత. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్‌ చిత్రం ‘96’కి తెలుగు రీమేక్‌ ఇది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సి.ప్రేమ్‌కుమారే తెలుగు రీమేక్‌నూ తెరకెక్కిస్తున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు సమంత.

‘‘నా కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాను పూర్తి చేశాను. నాలోని నటిని మెరుగుపరచుకునేలా నన్ను చాలెంజ్‌ చేసిన ఈ సినిమాలోని పాత్రను ముగించాను. మంచి చిత్రబృందంతో పని చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సమంత. ఈ చిత్రంలో సమంత పాత్ర పేరు జానకి కావడంతో ముద్దుగా జాను అని పిలుస్తారని సమాచారం. సో.. జాను పాత్రకు సమంత బై బై చెప్పేశారన్నమాట. ఈ సినిమాకు గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement