ఆ విషయంలో చిరుపై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్‌! | Megastar Chiranjeevi Is Ready To Act Another Two Remake Movies | Sakshi
Sakshi News home page

Chiranjeevi: ఆ విషయంలో చిరుపై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్‌!

Published Sat, Jan 21 2023 4:10 PM | Last Updated on Sat, Jan 21 2023 4:23 PM

Megastar Chiranjeevi Is Ready To Act Another Two Remake Movies - Sakshi

ఒకవైపు రామ్ చరణ్ రీమేక్స్ లో నటించడం రిస్క్ అంటాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రీమేక్స్ అంటేనే ఇంట్రెస్ట్ అంటున్నాడు. చిరంజీవి ఇప్పటికే చాలా రీమేక్స్ లో నటించాడు. ఇప్పుడు మరో రెండు రీమేక్స్ తో తిరిగొస్తానంటున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు. తమిళనాడులో అజిత్ సినిమాలు దుమ్మురేపుతుండటం చూసి, చిరు ఈ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. వీటిని తన ఇమేజ్ తగ్గట్లు మార్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే వేదాళం చిత్రాన్ని చిరు ‘భోళాశంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు వినాయక్ చేతికి అజిత్ నటించిన విశ్వాసం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఒక వైపు స్ట్రెయిట్ గా మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.150 కోట్లు వసూళ్లు దాటి పరుగులు తీస్తుంటే, మళ్లీ చిరు రీమేక్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ బాధపడుతున్నారు. వేదాళం, విశ్వాసం చిత్రాల తర్వాత అజిత్ నటించిన మరో సినిమా ఎంతవాడు గాని తెలుగు రీమేక్ లో చిరు నటించాలనుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement