vedalam movie
-
ఆ విషయంలో చిరుపై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్!
ఒకవైపు రామ్ చరణ్ రీమేక్స్ లో నటించడం రిస్క్ అంటాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రీమేక్స్ అంటేనే ఇంట్రెస్ట్ అంటున్నాడు. చిరంజీవి ఇప్పటికే చాలా రీమేక్స్ లో నటించాడు. ఇప్పుడు మరో రెండు రీమేక్స్ తో తిరిగొస్తానంటున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు. తమిళనాడులో అజిత్ సినిమాలు దుమ్మురేపుతుండటం చూసి, చిరు ఈ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. వీటిని తన ఇమేజ్ తగ్గట్లు మార్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వేదాళం చిత్రాన్ని చిరు ‘భోళాశంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు వినాయక్ చేతికి అజిత్ నటించిన విశ్వాసం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఒక వైపు స్ట్రెయిట్ గా మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.150 కోట్లు వసూళ్లు దాటి పరుగులు తీస్తుంటే, మళ్లీ చిరు రీమేక్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ బాధపడుతున్నారు. వేదాళం, విశ్వాసం చిత్రాల తర్వాత అజిత్ నటించిన మరో సినిమా ఎంతవాడు గాని తెలుగు రీమేక్ లో చిరు నటించాలనుకున్నాడు. -
హిందీ వేదాలంలో..
బాలీవుడ్లో సౌత్ రీమేక్‌ల హవా మరింత జోరు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కాంచన’, ‘ఆర్ఎక్స్ 100’, ‘ప్రస్తానం’... ఇలా మరికొన్ని దక్షిణాది సినిమాలు బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా అజిత్ ‘వేదాలం’ కూడా చేరిందన్నది బాలీవుడ్ ఖబర్. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ‘వేదాలం’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో జాన్ అబ్రహాం హీరోగా నటించడానికి ఆసక్తి చూపించారని తెలిసింది. స్క్రిప్ట్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లు మార్పులు చేస్తారట. ఈ సినిమా ఎవరు దర్శకుడు అనే చర్చల్లో కొందరి ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ చిత్రం
వేదాళం చిత్రం తరువాత అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న విషయం తెలిసిందే. దానికి అజిత్ హీరోగా వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే దర్శకత్వం వహించనున్నారన్న విషయం ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రాన్ని ఏ సంస్థ నిర్మించనుందన్న అంశమే సస్పెన్స్‌గా ఉంది. అయితే ఆ విషయం ఇప్పుడు బయటపడింది. ఈ భారీ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనుంది. ఈ సంస్థ ప్రస్తుతం ధనుష్ హీరోగా ప్రభుసాలోమన్ దర్శకత్వంలో ఒక చిత్రం, విక్రమ్ ప్రభు హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మిస్తోంది. తాజాగా అజిత్ కథానాయకుడిగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సహా విదేశీయానంలో ఉన్న అజిత్ మే నెలలో చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే ఆయన తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్రాన్ని 2017 జనవరికి విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో వీరం చిత్రం ఫేమ్ తమన్న మరోసారి అజిత్‌తో జత కట్టే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా. చిత్ర వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదన్నది గమనార్హం. అయితే ఆ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. -
ఈత దుస్తులకు సిద్ధం
తమిళసినిమా: క్షణ క్షణంబుల్ మారున్ జవరాలి చిత్తం అని పెద్దలు ఊరకే అనలేదు. సినీ తారల విషయానికొస్తే ఈ విషయం నూరుపాళ్లు నిజమని చెప్పాలనిపిస్తుంది. వీటి మాటలకు, చేతలకు పొంతన ఉండదు. నటి లక్ష్మీమీనన్ సంగతే చూడండి. తన శారీరక భాషకు గ్లామర్ పాత్రలు అస్సలు నప్పవు. ఇది ఇంతకు ముందు మాట. గ్లామరే కాదు, స్విమ్ దుస్తులు ధరించడానికీ సిద్ధమే. ఇది ఇప్పటి మాట. ఈ అమ్మడు పట్టుమని పది చిత్రాలయినా చేయలేదు. ఇంతలోనే అభిప్రాయంలో ఎంత మార్పో చూడండి. లక్ష్మీమీనన్ మంచి నటే. లక్కీ కథానాయకి కూడా. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఇందుకు చదువు మీద దృష్టి లాంటి వ్యక్తిగత అంశాలు ఒక కారణం కావచ్చు. ఈ అమ్మడు అజిత్‌కు చెల్లెలిగా నటించిన వేదాళం చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మీమీనన్‌తో చిన్న భేటీ. ప్ర: కథానాయికగా నటిస్తూ వేదాళం చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటించడానికి కారణం? జ: చిత్ర కథ నచ్చింది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. అందుకే చెల్లెలి పాత్రకు అంగీకరించాను. వేదాళం చిత్రం చూసిన వారికి అందులో తమిళ్ అనే నా పాత్ర బాగా నచ్చుతుంది. ప్ర: అజిత్ నుంచి నేర్చుకున్నది? జ: ప్రశాంతంగా ఉండటం. సెట్లో ఒక హలో ఒక హాయ్ అంతే. నా పని ముగియగానే ఒక పక్కన కూర్చుంటాను. అజిత్ అంతే అవసరం ఉంటేనే మాట్లాడతారు. లేకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్ర: ఇంతకు ముందు కొంబన్ లాంటి చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించారు. అలాంటి పాత్రల్నే ఇష్టపడుతున్నారా లేదా నగర యువతి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారా? జ: నిజం చెప్పాలంటే గ్రామీణ కథా చిత్రాలు నాకు నప్పడం లేదు. అలాంటి అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి. నాకు మాత్రం మోడ్రన్ పాత్రలు ధరించడం అంటేనే ఇష్టం. ప్ర: ప్రస్తుతం దెయ్యాల చిత్రాల ట్రెండ్ న డుస్తోంది. మీరూ అలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారా? జ: ఇప్పటి వరకూ అలాంటి అవకాశం రాలేదు. ఇకపై వస్తే తప్పకుండా నటిస్తాను. ఎలాంటి చిత్రం అయినా అందులో నా పాత్ర నచ్చాలి. ప్ర: ఇప్పటి వరకూ నటించిన వాటిలో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్ శివప్పుమణిదన్ ప్ర: భరతనాట్యం నేర్చుకున్నారు. నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడు గాయనీ అవతారం కూడా ఎత్తారు. వీటిలో ఏదంటే ఎక్కువ ఇష్టం? జ: నటనకంటే పాడటమంటేనే నాకు చాలా ఇష్టం. సంగీత దర్శకులు డీ.ఇమాన్. తమన్ చిత్రాల్లో పాడాను. ఇతర సంగీత దర్శకులు అవకాశం ఇచ్చినా పాడటానికి సిద్ధమే. పాడిన తర్వాత ఆ పాటను పూర్తిగా విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు. ప్ర: అభిమానులు మిమ్మల్ని ఎలాంటి దుస్తుల్లో చూడాలని కోరుకుంటున్నారు? జ: నాకు తెలిసి అధిక మంది అభిమానులు లంగా ఓణీల్లోనే చూడాలని కోరుకుంటున్నారు. ప్ర: మీరు ఎంతకాలం ఇలా లంగా ఓణీ పాత్రల్లో నటిస్తారు. గ్లామర్ పాత్రలు పోషించాలన్న ఆశ లేదా? జ: అలాంటిదేమీ లేదు. గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తాను. ప్ర: ఈత దుస్తులు ధరించి నటిస్తారా? జ: చిత్ర కథకు అలాంటి దుస్తులు అవసరం అయితే తప్పకుండా నటిస్తాను. సన్నివేశం ప్రాముఖ్యత తెలిసిన తరువాత నటించనని చెప్పను. ప్ర: మీరు నటించిన వేదాళం చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. సంతోషంగా ఉందా? టెన్షన్‌గా ఉందా? జ: ఎలాంటి టెన్షన్ లేదు. టెన్షన్ అన్నది ఎరుగని క్యారెక్టర్ నాది. ఒక చిత్రం పూర్తి చేశానంటే తదుపరి చిత్రానికి రె డీ అయిపోతాను. దీపావళికి వేదాళం చిత్రం విడుదలవడం సంతోషమే. ప్ర: కేరళలో ఉంటూ షూటింగ్‌ల కోసం చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి వెళ్లడం శ్రమ అనిపించడం లేదా? జ: చెన్నైకి మకాం మార్చే ఆలోచన నాకు లేదు. ఇంతకు ముందు నాతో అమ్మ కూడా వచ్చేది. ఇప్పుడు నేను ఒంటరిగానే వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మమ్మ కూడా వస్తుంటుంది. అలా షూటింగ్‌లకు వచ్చి వెళ్లడం నాకు శ్రమ అనిపించడం లేదు. ప్ర: మరి పెళ్లి మాటేమిటీ? ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? జ: అయ్యయ్యో అసలు పెళ్లే వద్దనుకుంటుంటే ప్రేమా, దోమా అంటారేమిటి. ఒక వేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అది పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుంది. ప్ర: అవకాశాలు తగ్గినట్లున్నాయే? జ: అదేమీలేదు. చాలా అవకాశాలు వస్తున్నా అన్నీ అంగీకరించడం లేదు. నచ్చిన కథా చిత్రాలే చేస్తున్నాను. వేదాళం తర్వాత జయం రవి సరసన ఒక చిత్రం చేస్తున్నాను. -
షూటింగ్ లో హీరోకు తిరగబెట్టిన గాయం
చెన్నై: వేదాళమ్ షూటింగ్లో ప్రముఖ హీరో అజిత్ కాలు మడమకు మరోసారి గాయమైంది. అయితే గాయం బాధిస్తున్నా ఆయన మాత్రం షూటింగ్ ను పూర్తి చేయటం విశేషం. అజిత్ నటిస్తున్న వేదాళమ్ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్ర పాటల చిత్రీకరణ స్థానిక పెరంబూర్‌లోని బిన్ని మిల్లులో జరుగుతోంది. గురువారం పలువురు నృత్య కళాకారులతో కలిసి అజిత్ ఆడిపాడే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అనూహ్యంగా ఆయన కుడి కాలు పట్టుకుని బాధతో విలవిలలాడారు. దీంతో చిత్ర దర్శకుడు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని సూచించినా స్పాట్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్న అజిత్ గాయాన్ని కూడా లెక్కచేయకుండా పాటను కంటిన్యూ చేశాడట. ఈ సంఘటనపై అజిత్ సన్నిహితులు మాట్లాడుతూ....గతంలో 'ఆరంభం' సినిమాలో నటించినప్పుడు కారు అదుపు తప్పి ఆయన కాలు మీదగా వెళ్లడంతో కాలుకు తీవ్ర గాయమైందని.... అప్పట్లో వైద్య చికిత్స అనంతరం అజిత్ కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అయితే ఇపుడు అదే కాలు మడమకు ఒత్తిడి ఎక్కువ అవటంతో నొప్పి తిరగబెట్టినట్లు చెప్పారు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అజిత్‌కు టాటా చెప్పేసింది
చెన్నై : నటుడు అజిత్‌కు అందాల భామ శ్రుతిహాసన్ బై చెప్పేశారు. ఏమిటీ వారిద్దరి మధ్య ఏముంది? అజిత్‌కు శ్రుతిహాసన్ టాటా చెప్పడానికి అనేగా మీ సందేహం. వారిద్దరి మధ్య చాలానే ఉంది. ఇద్దరూ కలిసి ఒక క్రేజీ చిత్రంలో నటిస్తున్నారు. అది చాలదా అజిత్‌కు శ్రుతికి మధ్య చక్కని సాన్నిహిత్యం ఉందనడానికి. వీరిద్దరి తొలి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం వేదాళమ్ దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అజిత్ హీరోగా నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న మూడవ చిత్రం వేదాళమ్. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో శ్రుతిహసన్ అజిత్‌కు బై చెప్పేశారు. విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించి శ్రుతిహాసన్ తను నటించాల్సిన సన్నివేశాలను పూర్తి చేసేశారట. దీంతో అజిత్‌తో పాటు చిత్ర యూనిట్‌కు శ్రుతి టాటా బైబై చెప్పారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ వేదాళమ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు. ఎంతో వినయంగా ప్రవర్తించే దర్శకుడు శివ దర్శకత్వంలో నటించడం తీయని అనుభవం అని పేర్కొన్నారు. వేదాళం చిత్ర యూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.మరో పక్క చిత్ర టీజర్ విడుదలై అభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది. దీపావళికి తెరపైకి రానున్న వేదాళమ్ చిత్రంపై అజిత్ అభిమానులతో పాటు చిత్ర వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.