
జాన్ అబ్రహాం
బాలీవుడ్‌లో సౌత్ రీమేక్‌ల హవా మరింత జోరు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కాంచన’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘ప్రస్తానం’... ఇలా మరికొన్ని దక్షిణాది సినిమాలు బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా అజిత్ ‘వేదాలం’ కూడా చేరిందన్నది బాలీవుడ్ ఖబర్. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ‘వేదాలం’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో జాన్ అబ్రహాం హీరోగా నటించడానికి ఆసక్తి చూపించారని తెలిసింది. స్క్రిప్ట్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లు మార్పులు చేస్తారట. ఈ సినిమా ఎవరు దర్శకుడు అనే చర్చల్లో కొందరి ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment