
విక్టరీ వెంకటేష్ ఎంచుకున్న మార్గం ఏమిటి?
టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్లాస్ మూవీస్‌తో మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎప్పటికప్పుడు పెంచేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య వెంకీ తనకున్న క్రేజ్ పెంచుకోడానికి సరికొత్త రూట్ కనిపెట్టారు. అదే రీమేక్. సేఫ్ ఫార్ములా. రీమేక్స్తో విజయపధంలో దూసుకువెళుతున్నారు. తన సక్సెస్ రేట్ పెంచుకోవడానికి రీమేక్ మూవీస్‌లో నటించడానికే ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యంను అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల సైతం హిందీలో హిట్ అందుకున్న ఓ మైగాడ్ మూవీకి రీమేక్. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులలోనూ చాలా అంచనాలు ఉన్నాయి. గోపాల గోపాల ఘనవిజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.
వెంకీ టాలీవుడ్‌లో చేస్తున్న డైరెక్ట్ సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. దీంతో ఇతర భాషల్లో హిట్ అయిన కథలను టాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. తను ఫాలో అవుతున్న ఈ సేఫ్ ఫార్ములాతో అటు సక్సెస్ సాధిస్తున్నారు. ఇటు యూత్‌లో క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సలీమ్ అనే చిత్రాన్ని కూడా తెలుగులోకి రీమేక్ చేసేందుకు ఈ స్టార్ హీరో సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ సినిమా తప్పకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందని వెంకీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
**