
కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో షూటింగ్‌లు మొదలుపెట్టారు. సీనియర్ హీరోల్లో నాగార్జున ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుండగా తాజాగా వెంకటేశ్ కూడా ‘నారప్ప’ చిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. నవంబర్ మొదటి వారం నుంచి ఆయన ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రాన్నే తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’ 25 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనాతో షూటింగ్ పూర్తికాలేదు. నవంబర్‌లో మొదలుపెట్టే షెడ్యూల్‌ని బ్రేక్ లేకుండా సినిమా పూర్తయ్యేవరకూ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేసిందని సమాచారం.