తెలుగులో లెక్కలేనంత మంది హీరోలున్నారు. అందులో స్టార్స్ ఓ 10-15 మంది వరకు ఉంటారు. వీళ్లలో చాలామంది రీమేక్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా లిస్ట్ తీస్తే చాలావరకు రీమేక్స్ చేశారు. అయితే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి రీమేక్ చేయలేదు. చాలామందికి దీని గురించి తెలిసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేయడనేది మాత్రం పెద్దగ తెలియకపోవచ్చు.
నో రీమేక్స్
మహేశ్ కెరీర్ చూస్తే డిఫరెంట్ జానర్స్ అన్ని ట్రై చేశాడు. ప్రస్తుతం 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడు. అయితే మహేశ్ రీమేక్ సినిమాలకు వ్యతిరేకం. ఒరిజినల్ కథలు చెప్పాలనేది ఇతడి ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన కథని మళ్లీ చెప్పడం, ఒకరు చేసిన ఫెర్ఫార్మెన్స్ రిపీట్ చేయడం మహేశ్ కి ఇష్టం ఉండదట. స్వయంగా దీని గురించి మహేశ్ ఓ సందర్భంలో మాట్లాడాడు.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!)
కారణం అదే
'అప్పటికే ఓ సినిమా చూసిన తర్వాత సెట్స్ కి వెళ్తే.. నాకు అందులో ఆ హీరోనే కనిపిస్తాడు. ఆ హీరో చేసినట్లు చేయాలా? లేదంటే సొంతంగా చేయాలా అని కన్ఫ‍్యూజ్ అవుతాను. అందుకే వీలైనంత వరకు వాటికి నో చెబుతుంటాను. అందుకే రీమేక్స్ చేయనని చెబుతుంటాను. అయితే నేను చేసిన మూవీస్ ఇతర భాషల్లో రీమేక్ కావాలని అనుకుంటున్నా' అని మహేశ్‌బాబు చెప్పుకొచ్చాడు. సో అదనమాట విషయం.
కొత్త లుక్
మహేశ్ పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' నుంచి మరో లుక్ ని బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో నోటిలో బీడీ, గళ్ల లుంగీతో మహేశ్ కనిపించాడు. ఈ ఫొటో బాగానే ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం లిరికల్ సాంగ్, గ్లింప్స్ వీడియో వస్తుందని ఆశించారు. కేవలం పోస్టర్ మాత్రమే అనేసరికి డిసప్పాయింట్ అయ్యారు. రిలీజ్ తేదీలోనూ మార్పు జరిగింది. జనవరి 13న కాకుండా ఓ రోజు ముందు అంటే 12వ తేదీన సినిమా థియేటర్లలోకి రానుంది.
Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh 🤩#HBDSuperstarMaheshBabu ✨
— Guntur kaaram (@GunturKaaram) August 8, 2023
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉 #GunturKaaramOnJan12th… pic.twitter.com/lOzhJBZx1l
(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment