
దర్శకుడు ఆర్జే బాలాజీ గురువారం (జూన్ 3) మీడియాతో మాట్లాడుతూ ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రమన్నారు. 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హిందీ చిత్రం బదాయ్ హోకు ఇది రీమేక్ అని, అయితే ఇప్పటి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు చెప్పారు.
Badhaai Ho Movie Remake Veetla Vishesham Release Date Announced: ఆర్జే బాలాజీ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'వీట్ల విశేషం'. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో జీ.స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పీ, రోమియో పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జే బాలాజీ గురువారం (జూన్ 3) మీడియాతో మాట్లాడుతూ ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రమన్నారు. 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హిందీ చిత్రం బదాయ్ హోకు ఇది రీమేక్ అని, అయితే ఇప్పటి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు సత్యరాజ్, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో నటి అపర్ణ బాలమురళి తనకు జంటగా నటించారని తెలిపారు.
చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ..